సమ్మర్ పవర్ షార్టేజ్..కోతల నివారణపై గల్ఫ్ విద్యుత్ ఫోకస్..!!

- March 13, 2025 , by Maagulf
సమ్మర్ పవర్ షార్టేజ్..కోతల నివారణపై గల్ఫ్ విద్యుత్ ఫోకస్..!!

కువైట్: ఏటా సమ్మర్  లో విద్యుత్ కోతలను నివారించేందుకు గల్ఫ్ ఇంటర్ కనెక్షన్ నుండి పవర్ కొనుగోలు చేసేందుకు లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.  దీనికి మిలియన్ల దినార్లు ఖర్చవుతాయని తెలిపింది. నాల్గవ దశలో భాగంగా 900 మెగావాట్ల ఉత్పత్తిని అంచనా వేస్తున్న సుబియా స్టేషన్‌లోని గ్యాస్ టర్బైన్ యూనిట్ల సరఫరా, ఆపరేషన్ మరియు నిర్వహణ కోసం టెండర్‌ను అందించడంలో, అమలు చేయడంలో జాప్యం జరుగుతుందని అధికారులు హెచ్చరించారు.

నివేదికల ప్రకారం.. 2025 ఈ సంవత్సరం వేసవిలో కువైట్‌లో ఇంధన కొరత 1,600 మెగావాట్లకు చేరుకుంటుందని అంచనా. ఈ కొరత గణనీయంగా పెరిగి 2029 వేసవి నాటికి 5,600 మెగావాట్లకు చేరుకుంటుందని భావిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com