టెర్రర్ కుట్రను భగ్నం చేసిన పోలీసులు
- July 04, 2016
దాయిష్ తీవ్రవాద సంస్థ దేశంలో ఉగ్రదాడులకు పథక రచన చేయగా, పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరించి ఆ కుట్రను భగ్నం చేశారని కువైట్ ఇంటీరియర్ మినిస్ట్రీ వెల్లడించింది. దీనికి సంబంధించిన మూడు కేసుల్లో పలువురు అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నట్లు ఇంటీరియర్ మినిస్ట్రీ తెలిపింది. కువైట్‌కి చెందిన తలాల్ నయెఫ్ రాజా, దాడులకు పాల్పడేందుకు సమాయత్తమవుతుండగా అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఇంటీరియర్ మినిస్ట్రీకి చెందిన ఎస్టాబ్లిష్‌మెంట్‌పై దాడికి ఇతను కుట్రపన్నాడు. దయీష్ నుంచి తనకు అందిన ఆదేశాల మేరకు దాడులకు పాల్పడేందుకు సమాయత్తమవుతున్నట్లుగా నిందితుడు అంగీకరించాడు. ఓ తుపాకీతోపాటు, ఎక్స్‌ప్లోజివ్ బెల్ట్ ధరించి దాడులకు పాల్పడాలనుకున్నట్లు వివరించాడు నిందితుడు. మరో కేసులో అలి మొహమ్మద్ ఒమర్ అనే వ్యక్తితోపాటు అతని తల్లి అబ్దుల్లా మొహమ్మద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారు కూడా దాయీష్ సంస్థతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు. కువైట్‌కి చెందిన ఓ వ్యక్తి అలాగే ముబారక్ ఫహాద్ అనే గల్ఫ్ నేషన్‌కి చెందిన మరో వ్యక్తి, వీరితోపాటు ఆసియాకి చెందిన మరో వ్యక్తి గ్రూపుగా ఏర్పడి తీవ్రవాద కార్యకలాపాలకు ప్రయత్నిస్తుండగా వారినీ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టుల సందర్భంగా వారి నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు
తాజా వార్తలు
- ఖతార్‌లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్‌రౌండర్.. !
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!
- ఒమన్, అర్మేనియా చర్చలు..పలు కీలక అంశాలపై సమీక్ష..!!
- బహ్రెయిన్ పౌరులకు విద్యుత్, నీటి బిల్లుల్లో ఊరట..!!
- అబుదాబి–రియాద్ విమాన సర్వీసులు రద్దు.. అక్టోబర్ 19 వరకు నిలిపివేత
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన







