ఆన్లైన్ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసేవాళ్ళకు సజ్జనార్ వార్నింగ్
- March 14, 2025
హైదరాబాద్: జూదం ఓ వ్యసనమని నిస్సందేహంగా చెప్పొచ్చు.సరదాగా ప్రారంభమయ్యే ఈ వ్యసనం కొన్నాళ్లకే మనిషిని పూర్తిగా కబళిస్తుంది. గతంలో మారుమూల ప్రదేశాల్లో గుట్టుగా జూదం ఆడేవారు. అయితే, సాంకేతికత పెరిగిన నేపథ్యంలో, ఇప్పుడు అది తేలికగా అందుబాటులోకి వచ్చేసింది. ఆన్లైన్ బెట్టింగ్ యాప్లు అనేక కుటుంబాలను బలి తీసుకుంటున్నాయి. భారతదేశంలో బెట్టింగ్ పై నిషేధం ఉన్నప్పటికీ, మొబైల్ ఫోన్ ద్వారా బెట్టింగ్ యాప్లు విస్తృతంగా ప్రాచుర్యం పొందాయి.కొత్త కస్టమర్లను ఆకర్షించేందుకు ఈ యాప్లు తొలిసారి రిజిస్ట్రేషన్ చేసిన వారికి ప్రలోభాలుగా డబ్బును ఇస్తాయి. మొదట్లో వందకు రెండు వందలు, వెయ్యికి రెండు వేలు ఇవ్వడం ద్వారా వినియోగదారులను తన వలలోకి వేసుకుంటాయి. ఈజీ మనీ కోసం అనేక మంది ఈ ఊబిలో మునిగిపోతున్నారు. యువత మాత్రమే కాకుండా, ఉద్యోగులు, పోలీసులు, వ్యాపారులు కూడా వీటి బారిన పడుతున్నారు.
సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల ప్రమోషన్
ఐపీఎస్ అధికారి సజ్జనార్ తనదైన శైలిలో సైబర్ నేరాలపై పరిష్కారం చూపుతున్నారు. అమాయక యువకులను లక్ష్యంగా చేసుకుని బెట్టింగ్ యాప్ ల వైపు మళ్లించే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీసులకు సజ్జనార్ సూచిస్తున్నారు. ఈ క్రమంలో స్థానిక పోలీసులు బెట్టింగ్ యాప్ ప్రమోటర్లకు తగిన బుద్ధి చెబుతున్నారు.హోలీ పండుగ వేళ బెట్టింగ్ యాప్ ప్రమోటర్లకు సీనియర్ ఐపీఎస్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వారికి రంగు పడుద్దని తన ట్వీట్ ద్వారా హెచ్చరించారు.
Betting apps promote cheste… రంగు పడుద్ది!#SayNoToBettingApps #Holi #HolikaDahan pic.twitter.com/lWaQSMyIl6
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) March 14, 2025
తాజా వార్తలు
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- ఖతార్ విలువైన భాగస్వామి..గ్లోబల్ ఫండ్ చైర్ పర్సన్ ప్రశంసలు..!!
- జర్మన్ జాతీయుడిని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!







