శ్రీనివాస కళ్యాణోత్సవానికి రావాలని సీఎంకు ఆహ్వాన పత్రిక అందజేసిన టీటీడీ ఛైర్మన్
- March 14, 2025
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని టీటీడీ ఛైర్మన్ బీఆర్.నాయుడు, టీటీడీ బోర్డు సభ్యులు, ఈఓ శ్యామలరావు, జేఈఓ వెంకన్న చౌదరి ఉండవల్లి నివాసంలో కలిశారు. రేపు వెంకటపాలంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో జరిగే శ్రీనివాస కళ్యాణోత్సవానికి సీఎంను ఆహ్వానించారు.ఈ మేరకు ఆహ్వాన పత్రికను సీఎంకు అందజేశారు.
శనివారమే కళ్యాణం
వెంకన్న స్వామి దివ్య ఆశీస్సులతో అమరావతి పునర్నిర్మాణానికి ఏర్పాట్లు జరగుతున్నాయని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అన్నారు. శనివారం రాజధాని అమరావతిలోని వెంకటపాలెం గ్రామంలో ఉన్న శ్రీ వేంటేశ్వరస్వామివారి ఆలయ ప్రాంగణంలో జరగనున్న శ్రీవారి కల్యాణోత్సవ ఏర్పాట్లను ఇప్పటికే ఆయన పరిశీలించారు.
ఏర్పాట్లు
కల్యాణ మహోత్సవ ఏర్పాట్ల గురించి తెలియజేశారు. ఈ నెల 15వ తేదీ సాయంత్రం 6:30 నుంచి 8:30 గంటల వరకు జరిగే శ్రీనివాస కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు తెలిపారు.
శ్రీనివాస కళ్యాణం జరగటం సంతోషం
అమరావతి పునర్నిర్మాణానికి మొదటి విడతగా రూ.30 వేల కోట్లతో పనులకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో శ్రీనివాస కళ్యాణం జరగనుండటం ఆనందంగా ఉందన్నారు. శ్యామలరావు మాట్లాడుతూ కల్యాణానికి విచ్చేేస భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేపట్టినట్టు చెప్పారు.
తాజా వార్తలు
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!







