తెలంగాణ: వ‌చ్చే నెల‌ ఉద్యోగ విరమణ చేయనున్న సీఎస్‌ శాంతికుమారి!

- March 14, 2025 , by Maagulf
తెలంగాణ: వ‌చ్చే నెల‌ ఉద్యోగ విరమణ చేయనున్న సీఎస్‌ శాంతికుమారి!

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యాదర్శిగా ఉన్న శాంతికుమారి వచ్చే నెల 30న ఉద్యోగ విరమణ చేయనున్నారు. నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎంపికపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఇప్పటికే తన కసరత్తు ప్రారంభించినట్టు ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి.

తనకు సన్నిహితంగా ఉండే మంత్రులతో పలు దఫాలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎంపిక పై సీఎం రేవంత్‌ సమాలోచనలు జరిపినట్టు తెలుస్తొంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవికి సీనియర్‌ ఐఏఎస్‌లు అరవింద్‌ కుమార్‌, శశాంక్‌ గోయల్‌, రామకృష్ణారావు, జయేష్‌ రంజన్‌, వికాస్‌రాజ్‌ తదితరులకు అవకాశం ఉన్నా సీఎం రేవంత్‌ ఎవరి వైపు మొగ్గు చూపుతారన్నది ఆసక్తిని రేపుతోంది.

వచ్చే మూడున్నరేళ్లు కీలకంగా భావిస్తున్న సీఎం రేవంత్‌ తనతో పోటీ పడి పనిచేసేవారినే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించే అవకాశం ఉన్నట్టు చెబుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com