2025-26 అకాడమిక్ ఇయర్.. విద్యార్థుల నమోదుకు సర్క్యులర్‌ జారీ..!!

- March 15, 2025 , by Maagulf
2025-26 అకాడమిక్ ఇయర్.. విద్యార్థుల నమోదుకు సర్క్యులర్‌ జారీ..!!

దోహా: 2025-2026 విద్యా సంవత్సరానికి విద్యార్థుల నమోదుకు సంబంధించి విద్య, ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ (MoEHE) ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు సమగ్ర సర్క్యులర్‌ను జారీ చేసింది. ఈ సర్క్యులర్ విద్యార్థుల నమోదు, బదిలీ వ్యవస్థను ప్రారంభించే తేదీలు, కిండర్ గార్టెన్ నుండి పన్నెండవ తరగతి వరకు అన్ని తరగతులలో కొత్త విద్యార్థుల ప్రవేశ వయస్సు, విద్యార్థులను బదిలీ చేసే విధానాలను తెలియజేశారు.

ప్రభుత్వ పాఠశాలలు జాతీయ విద్యార్థి సమాచార వ్యవస్థ (NSIS) ద్వారా ఆటోమేటెడ్ బదిలీ ప్రక్రియను నిర్ణీత కాలపరిమితిలోపు పూర్తి చేయడానికి కృషి చేస్తున్నాయని తెలిపింది. బదిలీ ఆమోదం తర్వాత, పాఠశాలలు నోటిఫికేషన్‌లను ముద్రించి, పేర్కొన్న షెడ్యూల్ ప్రకారం తల్లిదండ్రులకు అందజేస్తాయన్నారు.

ప్రభుత్వ పాఠశాలల మధ్య కొత్త విద్యార్థుల నమోదు, బదిలీలు అడ్మిషన్ వర్గాలు, అడ్మిషన్ వయస్సు, పాఠశాల భౌగోళిక ప్రాంతం, ఖాళీలు వంటి ఆమోదించబడిన ప్రమాణాల ప్రకారం ఎలక్ట్రానిక్ పద్ధతిలో కేటాయిస్తారు. అల్ షమల్ సిటీ, దుఖాన్ సిటీ, అల్ కరానా, అల్ ఘువైరియా, అల్ జుబారా, అల్ ఖర్సా, అల్ కాబన్, అల్ జుమైలియా, రౌదత్ రషీద్ (బాలికలకు మాత్రమే) లో 2025-2026 విద్యా సంవత్సరం ప్రారంభంలో రిజిస్ట్రేషన్ గైడ్‌లో పేర్కొన్న షరతుల ప్రకారం పాఠశాలల ద్వారా నమోదు చేయనన్నట్లు వెల్లడించింది.

కిండర్ గార్టెన్ లో చేరేందుకు ఖతారీలు, ఖతారీ తల్లుల పిల్లలు, GCC పౌరుల పిల్లలు, ఖతారీ డాక్యుమెంట్ హోల్డర్ల పిల్లలు అర్హులు. వారు జనవరి 1, 2021 -డిసెంబర్ 31, 2021 మధ్య జన్మించి ఉండాలి. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com