అమెరికాలో గ్రీన్ కార్డు దారులకు షాకింగ్ న్యూస్..
- March 15, 2025
అమెరికా: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే. అక్రమంగా అమెరికాలో నివాసం ఉంటున్న వారిని తమతమ దేశాలకు పంపిస్తున్నారు. అయితే, అమెరికాలో గ్రీన్ కార్డు కలిగిన ఇతర దేశస్తులు తమకు ఎలాంటి ఇబ్బంది ఉండదని భావిస్తున్న వేళ అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
గ్రీన్ కార్డు కలిగిన వారు అమెరికాలో శాశ్వత నివాస దారులుగా గుర్తించబడతారు. గ్రీన్ కార్డు ద్వారా విదేశీ పౌరులకు అమెరికాలో నివసించేందుకు, పని చేసుకునేందుకు హక్కు కల్పిస్తుంది. అంతేకాక కోరుకున్న కంపెనీలో పనిచేయొచ్చు. సొంత వ్యాపారం వంటివీ చేసుకోవచ్చు. గ్రీన్ కార్డు పొందిన మూడు నుంచి ఐదేళ్లకు పౌరసత్వం కోసం కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అమెరికాలో నివసిస్తున్న వేలాదిమంది భారతీయులు దశాబ్దాలుగా గ్రీన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. అమెరికా ప్రతీయేటా గరిష్ఠంగా 6.75లక్షల గ్రీన్ కార్డులు మాత్రమే జారీ చేస్తుంది. వాటిలో ఏ దేశానికి ఏడు శాతం మించి ఇవ్వరాదన్న నిబంధన ఉంది. ప్రస్తుతం అమెరికాలో గ్రీన్ కార్డులున్న భారతీయుల సంఖ్య మూడు లక్షలకుపైగానే ఉంటుంది.
డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తరువాత గోల్డ్ కార్డు స్కీమును ప్రకటించాడు. గ్రీన్ కార్డు ద్వారా లభించే సదుపాయాలన్నీ గోల్డ్ కార్డు ద్వారా లభిస్తాయని ట్రంప్ చెప్పారు. గోల్డ్ కార్డు ద్వారా అదనంగా అమెరికాలో శాశ్వత నివాసానికి, పౌరసత్వానికి కూడా గోల్డ్ కార్డు రాచమార్గం అని ట్రంప్ చెప్పారు.గోల్డ్ కార్డు కోసం 50లక్షల డాలర్లు ఫీజుగా నిర్ణయించారు.కనీసం కోటి గోల్డ్ కార్డులు అమ్మాలనేది మా లక్ష్యం అని ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే, అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ తాజాగా చేసిన వ్యాఖ్యలు.. గ్రీన్ కార్డు కలిగిన విదేశీయుల్లోనూ, గోల్డ్ కార్డు కొనుగోలు చేయాలనుకుంటున్న వారిలో ఆందోళన కలిగిస్తున్నాయి.
తాజా వార్తలు
- కొలంబియా భూకంప బాధితులకు యూఏఈ భారీ సాయం..!!
- ఖతార్‌లో వినియోగదారుల భద్రతకు పెద్దపీట..!!
- షేక్ జాయెద్ రోడ్డు పై మరో లేన్.. ట్రాఫిక్ తగ్గించేందుకు దుబాయ్ RTA చర్యలు
- విజయవాడ నుంచి వారణాసికి డైరెక్ట్ ఫ్లైట్..
- షార్జా బస్‌స్టాప్‌లలో రియల్‌టైమ్ బస్ రాక సమాచారం
- ఒమన్‌లో ట్యాంకర్ ప్రమాదం పై కొనసాగుతున్న పర్యవేక్షణ
- ఇంద్రకీలాద్రి పై కొత్త రూల్స్..
- విశాఖపట్నంలో కమ్యూనిటీ ఫ్రిజ్‌లు
- UAEలో అవయవ మార్పిడి సేవల విస్తరణ..
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 2026: అక్టోబర్ 31 నుంచి 30 రోజుల ఆరోగ్య ఉద్యమం







