హెచ్ఐవీకి చెక్ పెట్టేలా కొత్త మందు..
- March 15, 2025
ప్రాణాంతకమైన ఎయిడ్స్ వ్యాధికి కారణమయ్యే హెచ్ఐవీ (హ్యూమన్ ఇమ్యూనో డెఫీషియెన్సీ వైరస్) పని పట్టేందుకు కొత్త మందు సిద్ధమవుతుంది. అమెరికాకు చెందిన గిలియడ్ సైన్సెస్ బయోఫార్మా సంస్థ సూది మందును సిద్ధం చేసింది.ఈ సంస్థ అభివృద్ధి చేసిన ‘లెనకాపవిర్’ అనే సూది మందు హెచ్ఐవీపై సమర్ధవంతంగా పనిచేస్తున్నట్లు నిర్ధారణ అయింది.
యూఎన్ ఎయిడ్స్ సంస్థ గణాంకాల ప్రకారం.. ప్రపంచ వ్యాప్తంగా 4.5కోట్ల మంది హెచ్ఐవీతో బాధపడుతున్నారు. ప్రతీయేటా సుమారు 13 లక్షల మంది హెచ్ఐవీ భారిన పడుతున్నారు. భారతదేశం విషయానికి వస్తే.. మన దేశంలో 25లక్షల మందికి హెచ్ఐవీ బాధితులు ఉన్నారు. అయితే, ప్రతీయేటా 66,400 మంది ఈ వైరస్ బారిన పడుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి.
హెచ్ఐవీకి చెక్ పెట్టేందుకు అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. తాజాగా.. అమెరికాకు చెందిన గిలియడ్ సైన్సెస్ బయో ఫార్మా సంస్థ సూది మందును కనుగొంది. ఒక్కసారి ఆ ఇంజెక్షన్ వేసుకుంటే 56వారాల పాటు అంటే 395 రోజులు అది శరీరంలో ఉండి హెచ్ఐవీ నుంచి రక్షణ కల్పిస్తునట్లు పరిశోధనల్లో తేలింది. సంస్థ చేసిన క్లీనికల్ ట్రయల్స్ లో ఈ విషయం వెల్లడైంది. దీనికి సంబంధించిన స్టడీ ఇటీవల లాన్సెట్ జర్నల్ లో ప్రచురితమైంది.
క్లీనికల్ ట్రయల్స్ కోసం సైంటిస్టులు 40 మంది వాలంటీర్లను ఎంపిక చేశారు. 5వేల మిల్లీ గ్రాముల (ఐదు గ్రాముల) డోసున్న సూది మందును రెండు రకాలుగా విభజించారు. ఐదు శాతం అల్కహాల్ ప్రిపరేషన్ తో ఒక ముందును, 10శాతం ఆల్కహాల్ ప్రిపరేషన్ తో మరో మందును సిద్ధం చేశారు. వాలంటీర్లలో 20 మందికి మొదటి మందును, మరో 20 మందికి రెండో మందును ఇంజెక్షన్ ద్వారా కండ (ఇంట్రా మస్క్యులర్)కు ఇచ్చి ఏడాది పాటు పరిశీలన జరిపారు. అనంతరం ఫలితాలను విశ్లేషించగా.. వారందరిలోనూ ఆ మందు సమర్ధవంతంగా పనిచేసిందని తేలింది. అయితే, ‘లెనకాపవిర్’ మందును చర్మం కింద (ఇంట్రా క్యూటేనియస్) రెండు డోసులుగా ఇవ్వడం కన్నా కండ ద్వారా ఏడాదికి ఒక్కసారి ఇవ్వడం వల్ల మూడున్నర రెట్లు బాగా పనిచేసిందని గుర్తించినట్లు పరిశోధకులు తెలిపారు.
లెనకాపవిర్ ఇంజెక్షన్ మందుతో సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేవని పరిశోధకులు తేల్చారు.అయితే, దీనిని పూర్తిస్థాయిలో వినియోగంలోకి తెస్తే హెచ్ఐవీ పేషెంట్లు ఇకపై రోజూ మాత్రలు వేసుకోవాల్సిన ఇబ్బంది తప్పుతుందని పరిశోధకులు పేర్కొంటున్నారు. అయితే, మందుపై మరింత పెద్ద స్థాయిలో అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని సైంటిస్టులు చెబుతున్నారు. అందుకే త్వరలోనే భారీ స్థాయిలో స్టడీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం లక్షన్నర మంది హెచ్ఐవీ బాధితులు ఉన్నారు. 2010లో హెచ్ఐవీ పేషెంట్ల సంఖ్య 2.1లక్షలు ఉండగా.. 14ఏళ్లలో అది 1.50 లక్షలకు తగ్గింది.
తాజా వార్తలు
- ఇరాన్ పోర్టులో భారీ పేలుడు.. 400 మందికి పైగా గాయాలు
- TGSRTC : త్వరలో హైదరాబాద్ కి 150 ఎలక్ట్రిక్ బస్సులు
- అబుదాబిలో అపార్ట్మెంట్ నుండి పడి యువకుడు మృతి..!!
- 17.6 కిలోల మెథాంఫేటమిన్ రవాణాను అడ్డుకున్న జాక్టా..!!
- కువైట్ లో అక్రమ క్రిప్టోకరెన్సీ మైనింగ్ కార్యకలాపాలపై ప్రచారం..!!
- దహిరాలో థర్డ్ స్కౌట్ క్యాంప్ అల్ ప్రారంభం..!!
- అల్ డైర్ సముద్ర తీరప్రాంతానికి ఫిషింగ్, సిట్టింగ్ ప్లాట్ఫామ్..!!
- ఖలీఫా అంతర్జాతీయ స్టేడియం.. మే 24న అమీర్ కప్ ఫైనల్కు ఆతిథ్యం..!!
- అమెరికాలో విదేశీ విద్యార్థులు హ్యాపీ
- విశాఖలో తలసేమియా బాధితుల కోసం మే 8న భరోసా కల్పిద్దాం-నారా భువనేశ్వరి