రాబిన్ హుడ్ మూవీలో డేవిడ్ వార్నర్..
- March 15, 2025
రాబిన్ హుడ్ మూవీలో డేవిడ్ వార్నర్..
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటిస్తున్న మూవీ రాబిన్ హుడ్. వెంకీ కుడుముల దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. శ్రీలీల కథానాయిక. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యేర్నేని, రవి శంకర్ లు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు.
ఇక ఈ చిత్రంలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు ఎన్నాళ్ల నుంచో వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలే నిజం అయ్యాయి. డేవిడ్ వార్నర్ రాబిన్ హుడ్ మూవీలో నటిస్తున్న చిత్ర బృందం అఫీషియల్‌గా ప్రకటించింది. అంతేకాదండోయ్ డేవిడ్ వార్నర్ కు సంబంధించిన లుక్ ను విడుదల చేసింది. ఈ లుక్‌లో వార్నర్ అదిరిపోయాడు.
దీని పై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. మైదానంలో అద్భుతాలు సృష్టించిన వార్నర్ ఇక వెండితెర పై సంచనాలను సృష్టించాలని కోరుకుంటున్నారు.
ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదారాబాద్ తరుపున డేవిడ్ వార్నర్ చాలా కాలం పాటు ఆడాడు. 2016లో అతడి నాయకత్వంలోనే ఎస్ఆర్‌హెచ్ ఐపీఎల్ విజేతగా నిలిచింది. ఆ తరువాత నుంచి ఇప్పటి వరకు ఎస్ఆర్‌హెచ్ మరోసారి కప్పును ముద్దాడలేకపోయింది.
తాజా వార్తలు
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!







