బోర్డర్‌లెస్ గాంధీ ప్రాజెక్ట్స్ : ఆస్ట్రేలియా

- September 24, 2016 , by Maagulf
బోర్డర్‌లెస్ గాంధీ ప్రాజెక్ట్స్ : ఆస్ట్రేలియా

ఆస్ట్రేలియాలో గాంధీ జయంతిని విశేషంగా నిర్వహించబోతున్నారు. బోర్డర్‌లెస్ గాంధీ ప్రాజెక్ట్స్ (ఆస్ట్రేలియా) పేరుతో నెల రోజుల పాటు నిర్వహించే ఎగ్జిబిషన్ వచ్చే నెల 2 నుంచి ప్రారంభమవుతాయి. ఈ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు గుర్‌గావ్ కళాకారుడు విభోర్ సొగానీకి ఆహ్వానం అందింది. ఆయన 'మహాత్మా ఇన్ మి' (నాలోని మహాత్ముడు) అనే కళారూపాలను ప్రదర్శిస్తారు.
బోర్డర్‌లెస్ గాంధీ ప్రాజెక్ట్స్ (ఆస్ట్రేలియా)ను నీలేష్, లెనే మక్వానా 2014లో స్థాపించారు. 2015లో పెర్త్‌లో అధికారికంగా ప్రారంభమైంది. మహాత్మా గాంధీ సమానత్వం, అహింస, శాంతి వంటివాటికి ప్రపంచ స్థాయి సంకేతమని వివరించే కార్యక్రమాలను నిర్వహిస్తుంది.

ఈ ఏడాది పెర్త్‌లోని బెల్ టవర్ ఎదుట ఉన్న బారక్ స్ట్రీట్ జెట్టీ వద్ద విభోర్ రూపొందించిన స్టెయిన్‌లెస్ స్టీల్ కళారూపాలను ప్రదర్శిస్తారు. విభోర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి భారతదేశ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, వెస్టర్న్ ఆస్ట్రేలియా ప్రభుత్వ బహుళ సంస్కృతుల శాఖ, భారతీయ సాంస్కృతిక సంబంధాల మండలి, ఆస్ట్రేలియాలో భారతదేశ హైకమిషనర్ నవదీప్ సూరి సహకారం అందిస్తున్నట్లు తెలిపారు. తాను 12 కళారూపాలను ప్రదర్శిస్తానని తెలిపారు.
సొగాని మాట్లాడుతూ ఈ ఎగ్జిబిషన్‌ను నిర్వహించేందుకు సంవత్సరం నుంచి చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. భారతీయులుగా మనందరికీ గాంధీజీ గురించి తెలుసునని, అయినప్పటికీ విస్తృత పరిశోధన చేసి గాంధీజీ కాలం కన్నా ఎంతో ముందున్న వ్యక్తి అని తెలుసుకున్నానని చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com