ఎగిరే వాహనాల కోసం ‘వెర్టిపోర్ట్’కు ఆమోదం
- April 26, 2024
యూఏఈ: ఏవియేషన్ అథారిటీ మొదటి వెర్టిపోర్ట్ కోసం ఆపరేషనల్ అనుమతిని మంజూరు చేసింది. ఈ నౌకాశ్రయాలు సంప్రదాయ విమానాల రన్‌వేలు లేకుండా ఎగిరే వాహనాల నిలువు టేకాఫ్ మరియు ల్యాండింగ్ కోసం అవసరం అవుతాయి. ప్రయాణీకుల పికప్, డ్రాప్-ఆఫ్ మరియు బ్యాటరీ ఛార్జింగ్ కోసం కేంద్రాలుగా ఇవి పనిచేస్తాయి. జనరల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ (GCAA) ఆమోదం యూఏఈ వినూత్న రవాణా పరిష్కారాల సాధనలో ఒక ముఖ్యమైన మైలురాయిగా భావిస్తున్నారు. GCAA డైరెక్టర్ జనరల్ సైఫ్ మొహమ్మద్ అల్ సువైదీ మాట్లాడుతూ.. యూఏఈలో అధునాతన ఎయిర్ మొబిలిటీని వేగవంతం చేయడానికి పరిశ్రమల నిబద్ధతను ప్రదర్శిస్తుందన్నారు. ఇది జాతీయ నిబంధనలను సపోర్టింగ్ చేయడంలో మరియు వెర్టిపోర్ట్‌ల సురక్షిత పునాదులను రూపొందించడంలో తమ విధానాన్ని తెలియజేస్తోందన్నారు. అధునాతన ఎయిర్ మొబిలిటీ పూర్తి సామర్థ్యాన్ని అన్‌లాక్ చేయడానికి, రవాణా పరిశ్రమలో ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి మొదటి అడుగుగా భావిస్తున్నారు. అబుదాబిలో జరిగిన DRIFTx ఈవెంట్‌లో ఈ ప్రకటన వెలువడింది. అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీస్ (ADIO), ఎమిరేట్స్ స్మార్ట్ & అటానమస్ వెహికల్ ఇండస్ట్రీ (SAVI) క్లస్టర్‌ల సహకారంతో ఈ వెర్టిపోర్ట్ తాజా పురోగతిని ప్రదర్శించారు.
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







