ఏపీకి ప్రధాని మోదీ..సభలు, రోడ్ షోల షెడ్యూల్ ఇదే
- April 26, 2024
అమరావతి: ఆంధప్రదేశ్ లో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ఖరారయింది. మే మూడు, నాలుగు తేదీల్లో ఆయన ఏపీలో పర్యటించనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. మూడో తేదీన పీలేరు నియోజకవర్గంలో జరిగే బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. నాలుగో తేదీన రాజమండ్రి, అనకాపల్లి నియోజకవర్గంలో జరిగే బహిరంగ సభల్లో పాల్గొంటారని చెబుతున్నారు. కీలకమైన విజయవాడలో ప్రధాని మోడీ రోడ్ షో నిర్వహించనున్నారు. మే 3వ తేదీ మధ్యాహ్నం 2.45 గంటలకు పీలేరు నియోజకవర్గంలో జరిగే బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తారు. ఆరోజు సాయంత్రం నాలుగు గంటలకు విజయవాడలో జరిగే రోడ్ షోలో పాల్గొంటారు. 4వ తేదీ మధ్యాహ్నం 3.45 గంటలకు రాజమండ్రి సభలో పాల్గొంటారు. సాయంత్రం ఆరు గంటలకు అనకాపల్లిలో జరిగే ప్రచారంలో పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. కూటమి అభ్యర్థుల తరఫున మోడీ ప్రచారం చేయనున్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







