అబుదాబి పోలీసుల అలెర్ట్..అలా చేస్తే 1,000 దిర్హామ్ ఫైన్

- April 26, 2024 , by Maagulf
అబుదాబి పోలీసుల అలెర్ట్..అలా చేస్తే 1,000 దిర్హామ్ ఫైన్

యూఏఈ: రోడ్ల పై నిర్లక్ష్యంగా ఉండే డ్రైవర్లకు అబుదాబి పోలీసులు హెచ్చరించారు.  సాధారణంగా సినిమాల్లో ఉపయోగించే CGI యానిమేషన్ రూపంలో హెచ్చరించారు.  రహదారి షోల్డర్ వద్ద ఓవర్ టేకింగ్ చేయవద్దని, వాహనం అత్యవసర పరిస్థితుల కోసం దానిని ప్రత్యేకించిచనట్టు పేర్కొన్నారు.  ఇది అంబులెన్స్‌లకు మరియు ప్రమాద స్థలాల వద్ద ప్రాణాలను రక్షించడానికి వెళ్లే అధికారులకు ఫాస్ట్ లేన్‌గా కూడా ఇది పనిచేస్తుందని పోలీసులు తెలిపారు. ఓవర్‌టేకింగ్ కోసం దీన్ని ఉపయోగించడం తీవ్రమైన నేరం అని, ఇది పెద్ద ప్రమాదాలకు దారి తీస్తుందని,  ప్రజల ప్రాణాలకు అపాయం కలిగించవచ్చని హెచ్చరించింది. రోడ్ షోల్డర్ పై ఓవర్‌టేక్ చేయడం అనేది ఫెడరల్ ట్రాఫిక్ చట్టంలోని ఆర్టికల్ 42 ఆధారంగా ప్రధాన ట్రాఫిక్ ఉల్లంఘన అని, దానికి Dh1,000 జరిమానా, ఆరు బ్లాక్ పాయింట్లను విధించే అవకాశం ఉందని తెలిపింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com