వ్యక్తిగత ఖర్చులపై సౌదీ యువరాజు వ్యాఖ్యలు
- March 19, 2018రియాద్: సౌదీ అరేబియా యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ విలాసవంతంమైన, దుబారాతో కూడిన వ్యక్తిగత జీవితం గురించి మీడియా ప్రస్తావించినప్పుడు ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పదమయ్యాయి. తనకున్న సంపద పూర్తిగా తన వ్యక్తిగత వ్యవహారమని ఆయన తేల్చిచెప్పారు. తన వ్యక్తిగత ఖర్చులకు సంబంధించినంత వరకు తాను సంపన్నుడే గానీ పేదవాడిని కాదని ఆయన స్పష్టం చేశారు. ఇలా చెబుతూ చెబుతూనే తాను మహాత్మా గాంధీనో లేక నెల్సన్ మండేలానో కాదని ఆయన వ్యాఖ్యానించారు. తాను ఓ వ్యక్తిగా తన వ్యక్తిగత ఆదాయంలో కొంత భాగాన్ని సేవా కార్యక్రమాలపై ఖర్చు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. తన ఆదాయంలో కనీసం 51 శాతం పేదప్రజలపై మరో 49 శాతం తన కోసం ఖర్చు చేస్తానని బిన్ చెప్పుకొచ్చారు. కాగా, ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన నివాసమైన 'ఫ్రెంచ్ కోట'కు బిన్ యజమాని అని న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఇటీవల ఓ కథనాన్ని ప్రచురించిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- బహ్రెయిన్ స్కూళ్లల్లో ఇంగ్లిష్ లో సైన్స్, మ్యాథ్స్ బోధన
- కువైట్ లో వర్క్ పర్మిట్ జారీకి కీలక ప్రతిపాదనలు..!
- భారత ప్రయాణికులకు శుభవార్త..!
- దుబాయ్ లో కొత్తగా 30 పార్కుల నిర్మాణం..!
- 20 అవినీతి కేసులపై నజాహా దర్యాప్తు
- విద్యార్థుల కోసం 4 రెసిడెన్సీ వీసాలు..ఖర్చు, ప్రక్రియ
- వీసా నిబంధనలు కఠినతరం చేసిన ఆస్ట్రేలియా..
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా