చెన్నైలో కేసీఆర్.. కీలక నేతలతో భేటీలు
- April 29, 2018
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదివారం చెన్నైలో డీఎంకే నేతలు కరుణానిధి, స్టాలిన్‌లతో భేటీ అయ్యారు. నేటి ఉదయం ప్రగతి భవన్ నుంచి బేగంపేట్ విమానాశ్రయానికి బయలుదేరిన సీఎం కేసీఆర్.. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో చెన్నై చేరుకున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు హోటల్ ఐటీసీ గ్రాండ్ చోళాకు వెళ్లిన కేసీఆర్ 1.30 గంటల సమయంలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధితో, ప్రతిపక్ష నేత స్టాలిన్‌తో భేటీ అయ్యారు.
ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై సీఎం కేసీఆర్ డీఎంకే నేతలతో చర్చిస్తున్నారు. కేసీఆర్ వెంట టీఆర్ఎస్ ఎంపీలు కేశవరావు, వినోద్, రాష్ట్ర మంత్రులు ఈటల రాజేందర్, హరీష్ రావు ఉన్నారు. డీఎంకే నేతలతో కీలక భేటీ అనంతరం హోటల్ ఐటీసీ గ్రాండ్ చోళాకు కేసీఆర్ బృందం చేరుకుంటుంది. తర్వాత షెడ్యూల్ ప్రకారం పలు సమావేశాల్లో పాల్గొంటారు. రాత్రికి చెన్నైలోనే బస చేస్తారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 1.30కు ప్రగతి భవన్ చేరుకుంటారు. త్వరలో యూపీ సీఎం అఖిలేష్ యాదవ్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ లతో భేటీ కానున్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్‌లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







