స్వచ్ఛ భారత్ ఇంటర్న్ షిప్‌లో పాల్గొనండిః మోదీ

స్వచ్ఛ భారత్ ఇంటర్న్ షిప్‌లో పాల్గొనండిః మోదీ

స్వచ్ఛ భారత్‌ ఉద్యమంలో విద్యార్థులు చురుకుగా పాల్గొనాలని ప్రధాని మోదీ పిలుపు ఇచ్చారు. ఇవాళ మన్‌ కీ బాత్‌లో మోదీ అనేక విషయాలపై మాట్లాడారు. వేసవి సెలవుల్లో విద్యార్థులు వివిధ ప్రభుత్వ శాఖలు రూపొందించిన స్వచ్ఛ భారత్‌ ఇంటర్న్‌షిప్‌లో సమయాన్ని వెచ్చించాలని కోరారు. మే 1 నుంచి జులై 31 వరకూ సాగే ఇంటర్న్‌షిప్‌ కనీసం 100 గంటల పాటు ఉంటుంది. కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో మహిళా అథ్లెట్లు సత్తా చాటారని మోదీ ప్రశంసిచారు. రంజాన్‌, బుద్ధ పూర్ణిమ సందర్భంగా మహ్మద్‌ ప్రవక్త, గౌతమ బుద్ధలను ప్రధాని తన ప్రసంగంలో ప్రస్తుతించారు.

Back to Top