అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- July 18, 2026
రియాద్: సౌదీ సెంటర్ ఫర్ ఆర్గన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ (SCOT) సమన్వయంతో బ్రెయిన్ డెడ్ చెందిన డోనర్స్ నుంచి అవయవాలను సేకరించి 12 మంది రోగులకు విజయవంతంగా మార్పిడి చేశారు. వీరిలో నలుగురు చిన్నారులు కూడా ఉన్నారు. ఐదు అవయవ సేకరణ ప్రక్రియల్లో నాలుగు కేవలం 48 గంటల్లోనే పూర్తి అయినట్లు అధికారులు తెలిపారు. మొత్తంగా రెండు హార్ట్, రెండు లీవర్ , రెండు లంగ్స్ , ఆరు కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ ఆపరేషన్లు నిర్వహించారు. దీంతో చివరి దశ అవయవ వైఫల్యంతో బాధపడుతున్న పలువురికి కొత్త జీవితం లభించింది.
అవయవాల కేటాయింపును పూర్తిగా వైద్య నైతిక ప్రమాణాలు, అత్యవసరత ఆధారంగా పారదర్శకంగా నిర్వహించినట్లు ఎస్‌సీఓటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ తలాల్ అల్-ఖౌఫీ తెలిపారు. అవయవదానానికి అంగీకరించిన దాతల కుటుంబాలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సౌదీలో అవయవదానం కోసం ప్రజలు తవక్కల్నా ప్లాట్‌ఫామ్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







