'ముద్ర' సినిమా ఫస్ట్ లుక్ విడుదల
- June 01, 2018కెరీర్లో స్లో అండ్ స్టడీగా సినిమాలు చేస్తూ వెళుతున్న యంగ్ హీరో నిఖిల్. ఈ ఏడాది కిరాక్ పార్టీ అనే రీమేక్ సినిమాతో తెలుగు ప్రేక్షకులని పలకరించాడు నిఖిల్. ఈ సినిమా అంతగా ఆదరణ పొందలేకపోయింది. ఈ క్రమంలో తన తదుపరి సినిమాపై పూర్తి దృష్టి సారించాడు. ప్రస్తుతం తమిళ్లో విజయం సాధించిన కనితన్ మూవీని తెలుగులో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే.
నిఖిల్ 16వ సినిమా ఫస్ట్ లుక్‌ని ఆయన బర్త్ డే సందర్భంగా విడుదల చేశారు. ముద్ర అనే టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రంలో లావణ్య త్రిపాఠి కథానాయికగా నటిస్తుంది. టీఎన్ సంతోష్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కనుంది. ఆరా సినిమాస్ ప్రైవేట్ లిమిటెడ్, మూవీ డైనమిక్స్, ఎల్ఎల్పి పతాకాలపై కావ్య వేణుగోపాల్, రాజ్ కుమార్‌లు నిర్మిస్తున్న ఈ చిత్రంలో నిఖిల్ జర్నలిస్ట్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రంలో వెన్నెల కిశోర్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమాన సర్వీసులు రద్దు
- వేములవాడ ఆలయంలో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు
- బహ్రెయిన్ స్కూళ్లల్లో ఇంగ్లిష్ లో సైన్స్, మ్యాథ్స్ బోధన
- కువైట్ లో వర్క్ పర్మిట్ జారీకి కీలక ప్రతిపాదనలు..!
- భారత ప్రయాణికులకు శుభవార్త..!
- దుబాయ్ లో కొత్తగా 30 పార్కుల నిర్మాణం..!
- 20 అవినీతి కేసులపై నజాహా దర్యాప్తు
- విద్యార్థుల కోసం 4 రెసిడెన్సీ వీసాలు..ఖర్చు, ప్రక్రియ
- వీసా నిబంధనలు కఠినతరం చేసిన ఆస్ట్రేలియా..
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు