ములగకాయ విత్తనాలతో అదిరిపోయే శక్తి సామర్థ్యం...
- August 01, 2018ప్రకృతి మనకు ప్రసాదించిన ప్రతి వృక్షంతోనూ మనకు ఏదోవిధంగా ఉపయోగం ఉంటుంది. ఉదాహరణకు ములగ చెట్టు తీసుకోండి. ములగతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. కొన్ని చిట్కాలను చూద్దాం. ఎండిన ములగకాయలోని విత్తనాలను పొడి చెయ్యాలి. ఆ పొడిని ఒక చెంచా తేనేతో సేవించాలి. దీనివల్ల బి.పి కంట్రోల్ అయి ఆదుర్దా తగ్గుతుంది.
మొటిమలతో బాధపడేవారు ములగాకు రసంలో నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకోవాలి. ములగాకు రసంలో కొద్దిగా ఉప్పు కలిపి తాగితే అజీర్ణ సంబంధ బాధ ఉండదు. ములగాకు పొడిని రోజూ పరగడుపున చెంచా పొడిని మజ్జిగలో కలుపుకుని తాగితే గ్యాస్ట్రిక్ అల్సర్ దరిచేరదు.
ములగాకు రసంలో మిరియాల పొడి కలిపి కణతలపై రాయాలి. ములగ గింజలని చూర్ణం చేసి కషాయంగా వాడినా తలనొప్పికి ఉపశమనం కలిగిస్తుంది. ములగాకు నీడలో ఆరబెట్టి, పొడిచెయ్యాలి. ఆ పొడిలో నీళ్ళు కలిపి పేస్టులా చేసి తలకు రాసుకొని కొంత సేపు ఆగి తలస్నానం చెయ్యాలి. ఆ విధంగా చేస్తే జుట్టు రాలడం తగ్గుతుంది.
ములగ చెట్టు ఎండిన బెరడును ఆవుపాలలో మరిగించి కషాయం ఎండబెట్టాలి. ఆ పొడిని మూడు పూటలా నెల రోజులు తీసుకుంటే వీర్యవృద్ధి కలిగి చక్కని స్తంభన కలుగుతుంది. ములగ పూలు, పాలలో వేసుకొని తాగాలి. దీనివలన ఆడవారికి, మగవారికి శృంగార సామర్థ్యం పెరుగుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.
తాజా వార్తలు
- దుబాయ్ టాక్సీలో వస్తువులు మర్చిపోతే ఏం చేయాలి?
- ఐదోసారి రష్యా అధ్యక్షుడిగా పుతిన్..
- ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమాన సర్వీసులు రద్దు
- వేములవాడ ఆలయంలో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు
- బహ్రెయిన్ స్కూళ్లల్లో ఇంగ్లిష్ లో సైన్స్, మ్యాథ్స్ బోధన
- కువైట్ లో వర్క్ పర్మిట్ జారీకి కీలక ప్రతిపాదనలు..!
- భారత ప్రయాణికులకు శుభవార్త..!
- దుబాయ్ లో కొత్తగా 30 పార్కుల నిర్మాణం..!
- 20 అవినీతి కేసులపై నజాహా దర్యాప్తు
- విద్యార్థుల కోసం 4 రెసిడెన్సీ వీసాలు..ఖర్చు, ప్రక్రియ