మెంతికూరతో డయాబెటిస్‌కి చెక్...
- August 16, 2018మెంతి ఆకులను తీసుకుంటే అనారోగ్య సమస్యల నుండి విముక్తి చెందవచ్చును. శరీరానికి కావలసిన పోషకాలు కూడా పుష్కలంగా అందుతాయి. ఇలాంటి మెంతి కూరలో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసుకుందాం. లివర్ సమస్యలను తొలగించడంలో మెంతికూర చక్కగా పనిచేస్తుంది. శ్వాసకోశ సమస్యలు తొలగిపోతాయి.
మెంతికూర ఆకులు రక్తంలోని లిపిడ్ లెవల్స్‌పై మెరుగైన ప్రభావం చూపుతాయి. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. ఈ ఆకులను నీటిలో రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని వడగట్టి తీసుకుంటే ఆరోగ్యానికి చక్కగా పనిచేస్తుంది. డయాబెటిస్‌ను నయం చేయడంలో బాగా పనిచేస్తుంది. మెంతి కూరలోని ఔషధ కారకాలు రక్తం గడ్డకట్టకుండా కాపాడుతాయి.
గుండె సంబంధ వ్యాధులు రాకుండా కాపాడుతాయి. ఈ మెంతి కూరలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీర కణజాలాన్ని రక్షిస్తాయి. చర్మాన్ని ప్రకాశవంతంగా చేయడంలో మెంతి కూర చక్కగా ఉపయోగపడుతుంది. ఈ మెంతి ఆకులను పేస్ట్‌లా చేసుకుని జుట్టుకు రాసుకోవాలి. అరగంట తరువాత తలస్నానం చేస్తే వెంట్రుకలు ఒత్తుగా పెరుగుతాయి.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమాన సర్వీసులు రద్దు
- వేములవాడ ఆలయంలో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు
- బహ్రెయిన్ స్కూళ్లల్లో ఇంగ్లిష్ లో సైన్స్, మ్యాథ్స్ బోధన
- కువైట్ లో వర్క్ పర్మిట్ జారీకి కీలక ప్రతిపాదనలు..!
- భారత ప్రయాణికులకు శుభవార్త..!
- దుబాయ్ లో కొత్తగా 30 పార్కుల నిర్మాణం..!
- 20 అవినీతి కేసులపై నజాహా దర్యాప్తు
- విద్యార్థుల కోసం 4 రెసిడెన్సీ వీసాలు..ఖర్చు, ప్రక్రియ
- వీసా నిబంధనలు కఠినతరం చేసిన ఆస్ట్రేలియా..
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు