వాజ్ పేయి అంతిమయాత్రకు ఏర్పాట్లు...
- August 16, 2018
ఢిల్లీ : భారత మాజీ ప్రధాని వాజ్ పేయి అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. గత కొంతకాలంగా మూత్రనాళ ఇన్‌ఫెక్షన్‌తో ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఆయన గురువారం కన్నుమూశారు. ఏయిమ్స్ ఆసుపత్రి నుండి ఆయన నివాసానికి పార్థివదేహాన్ని తరలించారు. ఈ సందర్భంగా పలువురు నేతలు ఘనంగా నివాళులర్పిస్తున్నారు. శుక్రవారం వాజ్ పేయి నివాసం వద్దకు భారీగా ప్రజలు తరలివస్తున్నారు. నివాళి అర్పించేందుకు క్యూ లైన్ లో వేచి ఉన్నారు. వాజ్ పేయి చేసిన పనులను పలువురు గుర్తుకు తెచ్చుకుంటున్నారు.
శుక్రవారం ఉదయం 9 గంటలకు ఢిల్లీలోని బిజెపి కేంద్ర కార్యాలయానికి తరలిస్తారు. వాజ్‌పేయి అంత్యక్రియలు శుక్రవారం సాయంత్రం 5 గంటలకు యమునా నదీ తీరాన అధికార లాంఛనాలతో జరగనున్నాయి. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి వాజ్‌పేయి అంతిమ యాత్ర మొదలవుతుంది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్‌లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







