షురూ కానున్న 'భారతీయుడు-2' షూటింగ్
- October 21, 2018వెర్సటైల్ నటుడు కమల్ హసన్ పాలిటిక్స్ కి కాస్త గ్యాప్ ఇచ్చి , ముఖానికి మళ్ళీ రంగేసుకుంటున్నాడు. వెండి తెర మీద తిరిగి తన నట విరాట్ స్వరూపాన్ని చూపేందుకు రెడీ అవుతున్నాడు. 1996లో వచ్చిన తన 'భారతీయుడు' మూవీ రేపిన సంచలనానికి కొనసాగింపుగా..'భారతీయుడు-2' చిత్రాన్నితీయబోతున్నాడు. ఇందుకు ప్రత్యేకంగా అమెరికా నుంచి మేకప్ ఆర్టిస్టును రప్పించాడని, అప్పుడే మేకప్ సన్నాహాల్లో ఉన్నాడని కోలీవుడ్ కథనం.
భారతీయుడు చిత్రంలో అవినీతిపై ఉక్కుపాదం మోపిన సామాన్యుడిగా, ఆయన తండ్రిగా కమల్ హసన్ డబుల్ రోల్ పోషించాడు. తాజాగా మరి ఈ సీక్వెల్లో ఈ రెండో ' భారతీయుడు ' అలాంటి పాత్రే పోషిస్తాడా..నేటి రాజకీయ పరిస్థితులను, అవినీతిని ఇందులో ఎండగడతాడా అన్నది తేలాల్సి ఉంది. ఈ సినిమా షూటింగ్ వచ్చే నెల నుంచి ప్రారంభం కాబోతోంది. శంకర్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో నయనతార కీలకపాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో విడుదల..
- మీ వాట్సాప్ గ్రీన్ కలర్లోకి మారిందా?
- టీ20 వరల్డ్ కప్ కోసం భారత జట్టును ప్రకటించిన BCCI
- మే నెలలో పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
- విద్యార్థులపై లైంగిక వేధింపులు.. టీచర్‌కు 15 ఏళ్ల జైలుశిక్ష
- మనీలాండరింగ్..పౌరులు, ప్రవాసుడు అరెస్ట్
- నాలెడ్జ్ ఒమన్ అకాడమీ ప్రారంభం
- వేసవి కొత్త సీజన్ ప్రారంభం.. 40°Cకు ఉష్ణోగ్రతలు
- భారీ వర్షాలు.. నివాసితుల ముందస్తు జాగ్రత్తలు..!
- పారిశ్రామిక చట్టాల ఉల్లంఘన..11సంస్థలు మూసివేత