భారీ వర్షాలు.. నివాసితుల ముందస్తు జాగ్రత్తలు..!

- April 30, 2024 , by Maagulf
భారీ వర్షాలు.. నివాసితుల ముందస్తు జాగ్రత్తలు..!

యూఏఈ: గత అనుభవాల నేపథ్యంలో యూఏఈలోని నివాసితులు ఈ వారంలో ఉన్న భారీ వర్షాలకు సిద్ధమవుతున్నారు. ఆహారాన్ని నిల్వ చేసుకుంటున్నారు. ఇసుక బస్తాలతో తమ వ్యాపారాలను రక్షించే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తమ కార్లను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మే 2, 3వతేదీలలో దేశంలో భారీ వర్షాలు, అస్థిర వాతావరణ పరిస్థితులు ఉంటాయని జాతీయ వాతావరణ కేంద్రం (NCM) తెలిపిన విషయం తెలిసిందే. 

తమ ఇళ్లు మరియు వ్యాపారాలను కాపాడుకోవడానికి అవసరమైన ఏర్పాట్లు చేసుకున్నారు. దుబాయ్‌లోని సిలికాన్ ఒయాసిస్‌లోని బుకెండ్స్ అనే పుస్తక దుకాణం యజమానులు గ్రేస్ కరీమ్ మరియు ఆమె భాగస్వామి సోమియా అన్వర్ తమ దుకాణంలో పడుకోవాలని నిర్ణయించుకున్నారు.  “చివరిసారి వరద వచ్చినప్పుడు మేము షాక్ అయ్యాము.  మా దుకాణాన్ని ఇంత దయనీయ స్థితిలో చూడవలసి వచ్చింది. ఈసారి ఎలాంటి సంక్షోభం రాకుండా ముందుగానే ఉండేందుకు మేము దుకాణంలో పడుకోవాలని నిర్ణయించుకున్నాము. ”అని కరీమ్ అన్నారు. వరదనీటికి దెబ్బతినకుండా ప్రాంగణాన్ని పటిష్టం చేయడానికి ఇసుక సంచులను కూడా ఏర్పాటు చేసినట్టు తెలిపారు.  మునుపటి భారీ వర్షాల సమయంలో 13,000 పుస్తకాలు ధ్వంసమయ్యాయని పేర్కొన్నారు.  మరోవైపు కార్ షోరూమ్‌ల యజమానులు తమ వ్యాపారాలకు గతంలో జరిగిన నష్టాన్ని నివారించడానికి కూడా ముందస్తుగా రక్షణ కల్పిస్తున్నారు. N1 మోటార్స్ యజమాని మహమూద్ అహ్మద్‌ మాట్లాడుతూ..అల్ ఐన్‌లో సంభవించిన చివరి వడగళ్ళ వానలో, సుమారు 47 కార్లు దెబ్బతిన్నాయని తెలిపారు. వాతావరణ సూచనలతో మునుపటి నష్టాలను నివారించడానికి అవసరమైన చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. "షోరూమ్‌లో కేవలం నాలుగు కార్లు మాత్రమే ఉంటాయి కాబట్టి, కార్లు వరదతో దెబ్బతినకుండా భూమి నుండి పైకి ఏర్పాటు చేశాం. అధిక-విలువైన కార్లను ఎత్తైన ప్రదేశాలకు తరలించాము." అని పేర్కొన్నారు. కార్లను సురక్షితంగా ఉంచేందుకు  గిడ్డంగులను అద్దెకు తీసుకోవడం ద్వారా మేము జాగ్రత్తలు తీసుకున్నామని అల్ ఐన్‌లోని ఎమిరేట్స్ టాప్ కార్ షోరూమ్ యజమాని రియాద్ దర్విష్ వెల్లడించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com