మీ వాట్సాప్‌ గ్రీన్‌ కలర్‌లోకి మారిందా?

- April 30, 2024 , by Maagulf
మీ వాట్సాప్‌ గ్రీన్‌ కలర్‌లోకి మారిందా?

ప్రముఖ మెసేజింగ్ యాప్‌ వాట్సాప్‌ తాజాగా పూర్తిగా మార్పులు చేసింది. యూజర్లకు సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ అందించే క్రమంలో పలు మార్పులు చేసింది. ఇందులో ప్రధానంగా చేసిన మార్పు థీమ్‌ కలర్‌.

వాట్సాప్‌లో అంతకుముందు ‘నీలం’ రంగులో ఉండేది అయితే ప్రస్తుతం దీనిని గ్రీన్‌ కలర్‌లోకి మార్చారు. దాదాపు అందరూ యూజర్లకు ఈ కొత్త అప్‌డేట్‌ను తీసుకొచ్చింది. అయితే ఈ మార్పుపై యూజర్ల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది.

ఇదిలా ఉంటే వాట్సాప్‌లో థీమ్‌ కలర్‌ మార్చడం వెనకాల ఉన్న కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. యూజర్లు యాప్‌ను మరింత సౌలభ్యంగా ఉపయోగించడంతో పాటు సరికొత్త అనుభవం ఇవ్వడం కోసమే తాము థీమ్ కలర్‌ని ‘గ్రీన్’గా మార్చినట్టు మెటా సంస్థ పేర్కొంది. అదొక్కటే కాదు.. లుక్ కూడా కాస్త మార్చామని, స్పేసింగ్‌తో పాటు ఐకాన్స్‌లోనూ కొద్దిపాటు మార్పులు చేశామని సంస్థ తెలిపింది.

అదే విధంగా స్టేటస్ బార్ దగ్గర నుంచి చాట్-లిస్ట్ విండో దాకా.. డిజైన్ పరంగా దాదాపు యూజర్‌ ఇంటర్‌ఫేజ్‌ను మొత్తం మార్చేసింది వాట్సాప్‌. ఇక డార్క్ మోడ్ అయితే మరింత ముదురు రంగులోకి మార్చారు.

వీటితో పాటు వాట్సాప్‌లో ఫిల్టర్‌ ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఇందులో ఆల్‌, అన్‌రీడ్‌, గ్రూప్స్‌ అనే మూడు కేటగిరీల్లో మెసేజ్‌లను చూసుకునే వెసులుబాటు కల్పించారు. వీటితో పాటు స్టేటస్‌ను నేరుగా ఫార్వర్డ్‌ చేసే అవకాశాన్ని అందించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com