ఇనీషియల్ కన్స్ట్రక్షన్ పూర్తి చేయనున్న యూఏఈ హైపర్‌లూప్
- January 18, 2019ప్రపంచంలోనే తొలి సూపర్ ఫాస్ట్ హైపర్ లూప్ ట్రెయిన్ సిస్టమ్‌ని అరబ్ ఎమిరేట్స్‌లో వచ్చే ఏడాది చివరి నాటికి ఇనీషియల్ కన్స్ట్రక్షన్ పూర్తి చేయనున్నారు. ఫస్ట్ ఫేజ్‌లో ఈ నిర్మాణానికి సంబంధించి ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఎలోన్ మస్క్ - హైపర్ లూప్ ట్రాన్స్‌పోర్టేషన్ టెక్నాలజీ 10 కిలోమీటర్ల మేర ఈ ప్రాజెక్ట్‌ని తొలి దశలో పూర్తి చేయనుంది. అబుదాబీ మరియు దుబాయ్‌ని కలిపే 150 కిలోమీటర్ల దూరంలోని ఓ భాగమిది. కంపెనీ ఛైర్మన్ బిపాప్ గ్రెస్టా మాట్లాడుతూ, 3 నుంచి 6 బిలియన్ డాలర్ల ఖర్చుతో ఈ ప్రాజెక్ట్ నిర్మితమవుతోందని తెలిపారు. గత ఏప్రిల్‌లో హైపర్‌లూప్, అల్ దార్ ప్రాపర్టీస్‌తో కలిసి అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. యూఏఈ ట్రైన్‌కి సంబంధించి తొలి క్యాప్సూల్ స్పెయిన్ నుంచి టోలౌస్కి అసెంబ్లీ ఫెసిలిటీ చేరుకుంది. ఫ్రాన్స్‌లోని టోలౌస్లో ప్రోటో టైప్ ట్రాక్‌ని పరీక్షిస్తారు. మ్యాగ్నెటిక్ రెయిల్స్‌పై హైపర్ లూప్ పరుగులు తీస్తుంది. ట్యూబ్‌లో తక్కువ గాలి లేదా అసలు గాలి లేకుండా ఈ ట్రైన్ ప్రయాణిస్తుంది.
తాజా వార్తలు
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్‌కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు