దానిమ్మ గింజలను తింటే..

- January 19, 2019 , by Maagulf
దానిమ్మ గింజలను తింటే..

దానిమ్మ గింజలు రోజూ ఒక కప్పు తీసుకుంటే ఇట్టే సులభంగా బరువు తగ్గుతారని న్యూట్రీషియన్లు అంటున్నారు. ఇంకా ఆహార పదార్థాల తయారీకి ఆలివ్ ఆయిల్ ఉపయోగిస్తే మంచిదని వారు చెప్తున్నారు. ఈ నూనెలోని మోనో శాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ చెడు కొల్రెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను కాపాడతాయి. కాబట్టి బరువు పెరిగే సమస్యే వుండదు. 
 
అదేవిధంగా చేపలను వారానికి రెండుసార్లు తీసుకోవడం ద్వారా ఒబిసిటీ సమస్య వుండదు. చేపల్లో కొవ్వు ఉండదు. అందుకే క్యాలరీలు చాలా తక్కువ. కాబట్టి మటన్, చికెన్ జోలికి వెళ్లకుండా వీలైనంత వరకు చేపలను ఆహారంలో భాగం చేసుకుంటే.. బరువు పెరగడాన్ని నిరోధించుకోవచ్చు. 
 
వీటితో పాటు రోజువారి డైట్‌లో పచ్చని కాయగూరలు, ఆకుకూరలను తీసుకుంటూ వుండాలి. ఇందులో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల త్వరగా కడుపు నిండినట్టు అనిపిస్తుంది. కాబట్టి ముదురు ఆకుపచ్చ రంగుల్లో ఉండే కూరగాయలను ఎక్కువగా తింటే బరువు పెరగరు. వెజిటబుల్ సూప్స్ వల్ల కూడా క్యాలరీలు పెద్దగా పెరగవు. పైగా భోజనం వెజ్ సూప్ తీసుకుంటే ఆహారాన్ని మితంగా తీసుకునే అవకాశం వుంటుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com