ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు..
- January 29, 2019ఇండియన్ ఆర్మీ (ఐఏ) షార్ట్ సర్వీస్ కమిషన్ ద్వారా టెక్నికల్ విభాగంలో ఖాళీగా ఉన్న ఆఫీసర్ పోస్టుల భర్తీకి అవివాహిత పురుష, మహిళ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్ (టెక్నికల్)
మొత్తం ఖాళీలు: 191 (పురుషులు – 175, మహిళలు – 24)
బ్రాంచీల వారీగా ఖాళీలు:
సివిల్ 50, మెకానికల్ 17, ఎలక్ట్రికల్ / ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ 24, ఏరోనాటికల్ / బాలిస్టిక్స్ / ఏవియానిక్స్ 12, కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్ /కంప్యూటర్ టెక్నాలజీ/ ఇన్శర్మేషన్ టెక్నాలజీ/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ /ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్ 47, ఎలక్ట్రానిక్స్ & టెలీ కమ్యూనికేషన్ / టెలీకమ్యూనికేషన్ / ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్, శాటిలైట్ కమ్యూనికేషన్ 25, ఎలక్ట్రానిక్స్ / ఆప్టో ఎలక్ట్రానిక్స్ / ఫైబర్ ఆప్టిక్స్/ మైక్రో ఎలక్ట్రానిక్స్ అండ్ మైక్రోవేవ్ 8 , ప్రొడక్షన్ ఇంజనీరింగ్ 3, ఆర్కిటెక్చర్/ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీ 3 ఖాళీలు ఉన్నాయి.
అర్హత: సంబంధిత విభాగాల్లో బీఈ/బీటెక్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత, డిగ్రీ చివరి సంవత్సరం పరీక్షలు రాస్తున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వీరు అక్టోబర్ 1 లోపు ఉత్తీర్ణులు కావాలి.
వయసు: 2019 అక్టోబర్ 7 నాటికి 20 నుంచి 27 ఏండ్ల మధ్య ఉండాలి. (1992 అక్టోబర్ 2 నుంచి 1999 అక్టోబర్ 1 మధ్య జన్మించి ఉండాలి)
నిర్దేశిత శారీరక ప్రమాణాలను నిబంధనలకు అనుగుణంగా ఉండాలి. అభ్యర్థులు కనీసం 157.5 సెం.మీ ఉండాలి. ఎత్తుకు తగ్గ బరువు ఉండాలి.
విడోస్ ఆఫ్ డిఫెన్స్ అభ్యర్థులకు మాత్రమే
ఎస్ఎస్సీ (ఉమెన్) 2 ఖాళీలు (నాన్ టెక్నికల్ 1, టెక్నికల్ 1)
అర్హత: నాన్ టెక్నికల్‌కు ఏదైరా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ, టెక్నికల్‌కు ఏదైనా బ్రాంచీలో బీఈ / బీటెక్ ఉత్తీర్ణత
వయసు: 2019 అక్టోబర్ 7 నాటికి 35 ఏండ్లకు మించరాదు.
పే & అలవెన్సులు: ట్రెయినింగ్‌లో నెలకు రూ.56,100/- జీతం ఉంటుంది. శిక్షణ పూర్తయ్యాక లెప్టినెంట్ హోదాలో పే బ్యాండ్ రూ.56,100 – 1,77,500/- జీతం చెల్లిస్తారు.
వీటితో పాటు అదనంగా గ్రూప్ ఇన్సూరెన్స్, ఇతర సౌకర్యాలు ఉంటాయి.
శిక్షణ: ఆఫీసర్ ట్రయినింగ్ అకాడమీ చెన్నైలో 2019 అక్టోబర్ నుంచి 49 వారాల శిక్షణ ఉంటుంది. కోర్సును విజయవంతంగా పూర్తి చేసినవారికి ఆర్మీలో ఉద్యోగం కల్పిస్తారు.
ఎంపిక: సర్వీస్ సెలక్షన్ బోర్డ్ (ఎస్ఎస్బీ), ఇంటర్వ్యూ / టెస్ట్ ద్వారా
ఎస్ఎస్బీ అర్హత కలిగిన అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసి, రెండు దశల్లో ఇంటర్వ్యూ/ టెస్ట్‌లను నిర్వహిస్తుంది.
ఇంర్వ్యూ నిర్వహించే ప్రదేశం: ఎస్ఎస్బీ సైకలాజికల్ టెస్ట్, గ్రూప్ టెస్ట్, ఇంటర్వ్యూ / టెస్ట్‌లను వరుసగా ఐదు రోజుల పాటు అలహాబాద్, భోపాల్, బెంగళూరు, కపుర్తలా (పంజాబ్) లో నిర్వహిస్తారు.
దరఖాస్తు: ఆన్లైన్లో
రిజిస్ట్రేషన్ చివరి తేదీ: ఫిబ్రవరి 21
వెబ్సైట్: www.joinindianarmy.nic.in
తాజా వార్తలు
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్‌కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు