ఆ విషయంలో మహిళలదే పై చేయి
- April 15, 2019కువైట్ సిటీ: ఓ సర్వేలో కువైటీ మహిళలు, పురుషుల కంటే కాఫీ ఎక్కువగా తాగుతారని తేలింది. కాఫీ ప్రోడక్ట్స్‌కి సంబంధించిన న్యూట్రిషనల్ ఇన్ఫర్మేషన్ని తెలుసుకునేవారు కూడా పురుషుల కంటే మహిళలే ఎక్కువ వున్నారట. 30 మంది పురుషులు ఇలా న్యూట్రిషనల్ విలువల గురించి తెలసుకుంటోంటే, 34 శాతం మహిళలు ఆ పని చేస్తున్నారు. కువైట్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ ఫుడ్ సర్వీసెస్ మరియు న్యూట్రిషన్ ప్రొఫెసర్ అస్మా బస్తకి మరికొందరు విద్యార్థులు 1,483 మందిపై ఈ విషయమై సర్వే నిర్వహించారు. 18 నుంచి 35 ఏళ్ళ వయసున్నవారిని ఈ సర్వే కోసం ఎంచుకున్నారు. కువైటీలలో అత్యధిక శాతం మంది సేవించే కాఫీగా అమెరికానో సత్తా చాటింది. 13 శాతం మంది ప్రతిరోజూ కేఫ్‌లకు వెళుతుంటారనీ, 30 శాతం మంది నెలలో నాలుగు సార్లు వెళుతుంటారనీ, 26.6 శాతం పురుషులు, 23.2 శాతం మంది మహిళలు వారంలో ఒకటి నుంచి ఆరు సార్లు కేఫ్‌కి వెళుతుంటారనీ తేలింది. 51.4 శాతం మంది స్టార్‌బక్స్ కాఫీని ప్రిఫర్ చేస్తారట.
తాజా వార్తలు
- నేటి నుంచి టోల్ ఛార్జీలు పెంపు
- నూతన కార్యవర్గాన్ని ప్రకటించిన NATS
- తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డికి అమెరికాలో సత్కారం
- అంగరంగ వైభవంగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు
- ట్రాఫిక్ జరిమానాల పై డ్రైవర్లకు 50% తగ్గింపు
- ట్రావెల్ బ్యాన్..5 దశల్లో ఆన్లైన్లో తొలగింపు ఇలా..!
- మహిళలకు NATS ఉచితంగా కుట్టుమిషన్ల పంపిణీ
- దమాన్ హెల్త్ ఇన్సూరెన్స్..పెరగనున్న ప్రీమియం..!
- సౌదీ ఆదాయంలో 7.3% వృద్ధి
- అబుదాబి విమానాశ్రయంలో తగ్గిన పార్కింగ్ ఫీజులు