ఆటిజం బాధిత చిన్నారులకోసం 10,000 బహ్రెయినీ దినార్స్‌ సేకరణ

ఆటిజం బాధిత చిన్నారులకోసం 10,000 బహ్రెయినీ దినార్స్‌ సేకరణ

రోటరీ క్లబ్‌ ఇంటర్నేషనల్‌కి చెందిన రోటరాక్ట్‌ బహ్రెయిన్‌, వార్షిక చారిటీ ఫండ్‌ రైజర్‌ ఈవెంట్‌ని 'ఎగైనెస్ట్‌ ది క్లాక్‌' (ఎటిసి) పేరుతో అల్‌ బందర్‌ హోటల్‌ మరియు రిసార్ట్‌లో నిర్వహించింది. ఈ ఈవెంట్‌ ద్వారా 10,000 దిర్హామ్‌ల ఫండ్‌ని సేకరించారు. ఆటిజంతో బాధపడే చిన్నారుల కోసం ఈ నిధుల్ని వినియోగించనున్నారు. రోటరాక్ట్‌ బహ్రెయిన్‌కి రోటరీ క్లబ్‌ ఆఫ్‌ సల్మానియా, మనామా మరియు అదిలియా ఇతర ప్రపంచ స్థాయి సర్వీస్‌ ఆర్గనైజేషన్స్‌ సహాయ సహకారాలు అందిస్తున్నాయి. 'సర్వీస్‌ ఎబౌ యువర్‌సెల్ఫ్‌' నినాదంతో ఇవి పనిచేస్తున్నాయి. రోటరీ ఆర్గనైజేషన్‌కి 50 ఏళ్ళ అనుభవం ఈ సేవా రంగంలో వుంది. ఒమనెయాత్‌ ఫౌండేషన్‌ ఫర్‌ ఆటిజం మరియు ఇతర సొసైటీలు సంయుక్తంగా ఫండ్స్‌ని సేకరించి, బాధిత చిన్నారులకు అండగా నిలుస్తున్నాయి. 

 

Back to Top