విజయ్, అట్లీ కొత్త చిత్రం టైటిల్ 'బిగిల్'
- June 21, 2019కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తాజా చిత్రం `బిగిల్`( విజిల్ అనే అర్థం) అనే టైటిల్ ఖరారు చేశారు. అట్లీ దర్శకుడు. ఎ.జి.ఎస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కల్పాతి ఎస్.అఘోరం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శనివారం హీరో విజయ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఇందులో విజయ్ రెండు లుక్స్‌లో కనపడుతున్నారు. అంటే ఆయన రెండు పాత్రల్లో నటిస్తున్నారా? లేక రెండు షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నారా? అనేది తెలియడం లేదు. అయితే కోలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం విజయ్ రెండు పాత్రల్లో ఒకటి గ్యాంగ్‌స్టర్ పాత్ర అయితే.. మరొకటి ఫుట్‌బాల్ ప్లేయర్ పాత్రట. ఈ సినిమాను ఈ ఏడాది దీపావళికి విడుదల చేస్తున్నారు. `తెరి`, `మెర్సల్` చిత్రాల తర్వాత విజయ్ ,అట్లీ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం కావడంతో `బిగిల్` సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆస్కార్ విన్నర్ ఎ.ఆర్.రెహమాన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. నయనతార హీరోయిన్గా నటిస్తున్నారు.
తాజా వార్తలు
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్‌లో నిందితుడి అరెస్ట్
- సౌదీ సాయంతో పట్టుబడ్డ 47 కిలోల కొకైన్
- OMR30.6 బిలియన్లు దాటిన క్రెడిట్ బ్యాలెన్స్
- యూఏఈలో CSI చర్చి.. ఫస్ట్ లుక్ ఔట్
- ఏపీలో భానుడి విశ్వరూపం, బెంబేలెత్తిపోతున్న జనం
- వైసీపీ మేనిఫెస్టో ఫై ప్రశ్నల అస్త్రాలను సంధిస్తున్న నెటిజన్లు
- ఎన్నికల ప్రచారంలో హీరో వెంకటేశ్..?!!
- ఖతార్ విమానయాన రంగం.. అద్భుతమైన వృద్ధి..!