ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రపంచంలోనే అతిపెద్ద చెక్క రాట్నం
- July 05, 2016
ప్రపంచంలోనే అతిపెద్ద చెక్క రాట్నాన్ని మంగళవారం భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆవిష్కరించారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని మూడో నంబర్ టెర్మినల్‌లో దీన్ని ఏర్పాటు చేశారు. అహ్మదాబాద్‌లోని ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్(కెవిఐసీ) బృందం దీన్ని తయారు చేశారు. నాలుగు టన్నుల బరువు ఉండే ఈ రాట్నాన్ని తయారు చేసేందుకు అధిక నాణ్యమైన టేకును ఉపయోగించారు. 26 మంది వడ్రంగులు 40 రోజుల పాటు కష్టపడి దీన్ని రూపొందించారు. ఈ రాట్నం తొమ్మిది మీటర్ల పొడవు ఐదు మీటర్ల ఎత్తు ఉంటుంది. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు కల్‌రాజ్ మిశ్రా, మహేశ్ శర్మ, ధర్మేంద్ర ప్రధాన్ హాజరయ్యారు. ప్రదర్శనకు ఉంచిన ఈ రాట్నాన్ని సందర్శకులు ఆసక్తిగా తిలకిస్తున్నారు.
తాజా వార్తలు
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!







