తెలంగాణలో మెక్‌డొనాల్డ్స్ గ్లోబ‌ల్ సెంట‌ర్.. !

- March 19, 2025 , by Maagulf
తెలంగాణలో మెక్‌డొనాల్డ్స్ గ్లోబ‌ల్ సెంట‌ర్.. !

అమెరికా: అమెరికా మల్టీ నేషనల్ సంస్థ మెక్‌డొనాల్డ్స్ తెలంగాణ ప్రభుత్వంతో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. కంపెనీ విస్తరణలో భాగంగా హైదరాబాద్‌లో మెక్‌డొనాల్డ్స్ ఇండియా గ్లోబల్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. మెక్‌డొనాల్డ్స్ గ్లోబల్ ఇండియా ఆఫీసును 2,000 మంది ఉద్యోగులతో ప్రారంభించనుంది.

కాగా, హైదరాబాద్‌లో గ్లోబల్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి మెక్‌డొనాల్డ్స్ ముందుకు రావడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఈ గ్లోబల్ సెంటర్ ని తమ రాష్ట్రంలో స్థాపించడానికి ప‌లు రాష్ట్రాలు పోటీ పడుతున్న తరుణంలో, మెక్‌డొనాల్డ్స్ తన పెట్టుబడులకు తెలంగాణను గమ్యస్థానంగా ఎంచుకోవడం పట్ల తాను గర్వపడుతున్నానని ముఖ్యమంత్రి అన్నారు.

ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం ఉదయం అసెంబ్లీ ఛాంబర్‌లో మెక్‌డొనాల్డ్స్ చైర్మన్ మరియు CEO క్రిస్ కెంప్కెజెన్స్కీ, కంపెనీ ప్రతినిధులతో చర్చలు జరిపారు. గ్లోబల్ సెంటర్ స్థాపనకు ప్రభుత్వం త‌రఫున పూర్తి మద్దతు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా, మెక్‌డొనాల్డ్స్ తన ప్రపంచ కార్యాలయాన్ని స్థాపించడానికి రాష్ట్ర ప్రభుత్వంతో పెట్టుబడి ఒప్పందంపై సంతకం చేసింది.

ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి పాల్గొన్నారు. మెక్‌డొనాల్డ్స్ ప్రతినిధుల బృందంలో సీఈవో తో పాటు గ్లోబల్ బిజినెస్ సర్వీసెస్ అధ్యక్షుడు స్కై ఆండర్సన్, చీఫ్ గ్లోబల్ ఇంపాక్ట్ ఆఫీసర్ జాన్ బ్యానర్, గ్లోబల్ ఇండయా హెడ్ దేశాంత కైలా చర్చల్లో ఉన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com