చిరంజీవికి ‘జీవిత సాఫల్య పురస్కారం’..

- March 20, 2025 , by Maagulf
చిరంజీవికి ‘జీవిత సాఫల్య పురస్కారం’..

లండన్: మెగాస్టార్ చిరంజీవికి నిన్న హౌస్ ఆఫ్ కామ‌న్స్–యు.కె పార్ల‌మెంట్ లో గౌరవ స‌త్కారం జరిగింది. నాలుగున్నర దశాబ్దాలుగా సినిమాల ద్వారా కళారంగానికి, స‌మాజానికి చేసిన సేవ‌ల‌కు గాను యుకెకి చెందిన అధికార లేబ‌ర్ పార్టీ పార్ల‌మెంట్ మెంబ‌ర్ న‌వేందు మిశ్రా, పలువురు యూకే పార్లమెంట్ సభ్యులు చిరంజీవిని సన్మానించారు. ఇదే వేదికపై బ్రిడ్జ్ ఇండియా సంస్థ చిరంజీవి చేసిన కృషిని గుర్తించి ‘జీవిత సాఫల్య పురస్కారం’ అందించారు.

దీనికి సంబంధించి వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. ఇప్పటికే సినిమాల్లో ఎన్నో అవార్డులు, రివార్డులు, పద్మశ్రీ, పద్మ విభూషణ్, డాక్టరేట్, గిన్నిస్ బుక్ రికార్డ్.. ఇలా ఎన్నో అవార్డులు అందుకున్నారు. ఇప్పుడు యూకే పార్లమెంట్ లో లైఫ్ టైం అచివ్మెంట్ అవార్డు అందుకోవడంతో మరో ఘనత సాధించారు చిరంజీవి. దీంతో ఫ్యాన్స్, నెటిజన్లు, పలువురు సెలబ్రిటీలు చిరంజీవికి అభినందనలు తెలుపుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com