నాలుగవ షెడ్యూల్ కి చేరుకున్న 'వైశాఖం'

- July 05, 2016 , by Maagulf
నాలుగవ షెడ్యూల్ కి చేరుకున్న 'వైశాఖం'

బి. జయ దర్శకత్వంలో ఆర్‌.జె సినిమాస్‌ పతాకంపై బి.ఎ. రాజు నిర్మిస్తున్న 'వైశాఖం' చిత్రం నాలుగో షెడ్యూల్‌ ప్రారంభమైంది. జులై 20 వరకు జరిగే ఈ షెడ్యూల్‌లో చిత్రంలోని కీలకమైన సన్నివేశాల్ని, ఓ ఫైట్‌ని, ఓ పాటని చిత్రీకరిస్తామని చిత్ర బృందం తెలిపింది. ఈ సందర్భంగా దర్శకురాలు బి. జయ మాట్లాడుతూ 'లవ్‌లీ తర్వాత మళ్లీ సూపర్‌హిట్‌ సినిమా ఇవ్వాలన్న లక్ష్యంతో మంచి కథాంశంతో రూపొందిస్తున్న సినిమా వైశాఖం. కుటుంబ సభ్యులందరూ కలిసి చూసి ఎంజాయ్‌ చేసే మంచి సినిమాగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ఇది అపార్ట్‌మెంట్స్‌ నేపథ్యంలో సాగుతుంది. దర్శకురాలిగా నాకు మంచి పేరు తెచ్చే సినిమా ఇది. అలాగే కమర్షియల్‌గా పెద్ద హిట్‌ రేంజ్‌కి వెళ్తుంది. కజక్‌స్థాన్‌లో తీసిన సాంగ్స్‌ ఈ చిత్రానికి హైలైట్‌ అవుతాయి' అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com