ప్రభుత్వ రంగ ఉద్యోగులకు ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించిన దుబాయ్..!!
- March 21, 2025
దుబాయ్: ప్రభుత్వ ఉద్యోగులకు ఈద్ అల్ ఫితర్ సెలవులను దుబాయ్ ప్రకటించింది. ప్రభుత్వ రంగంలో పనిచేసే వారికి షవ్వాల్ 1 నుండి షవ్వాల్ 3, 1446 AH వరకు సెలవు ఉంటుందని తెలిపింది. అధికారిక పనులు షవ్వాల్ 4, 1446 AH న తిరిగి ప్రారంభమవుతాయని దుబాయ్ ప్రభుత్వ మానవ వనరుల విభాగం తెలిపింది.
అంతకుముందు, షార్జా కూడా ఈద్ అల్ ఫితర్ సెలవు తేదీలను ప్రకటించింది. ఇవి షవ్వాల్ 1 నుండి ప్రారంభమై షవ్వాల్ 3, 1446 AH వరకు కొనసాగుతాయని షార్జా ప్రభుత్వ మానవ వనరుల శాఖ తెలిపింది. షిఫ్ట్‌లలో పనిచేసే ఉద్యోగులు తప్ప, ప్రభుత్వ రంగానికి అధికారిక పనులు షవ్వాల్ 4, 1446 AH న తిరిగి ప్రారంభమవుతాయని పేర్కొంది.
చంద్రుని దర్శనాన్ని బట్టి, ఈద్ అల్ ఫితర్ మార్చి 30 ఆదివారం వస్తే, షార్జాలోని ప్రభుత్వ ఉద్యోగులకు ఏప్రిల్ 28 (శుక్రవారం) నుండి ఏప్రిల్ 1 (మంగళవారం) వరకు ఐదు రోజుల సెలవు లభిస్తుంది. మార్చి 31 (సోమవారం) పండుగ ప్రారంభమైతే, ఈ ఉద్యోగులకు మార్చి 28 (శుక్రవారం) నుండి ఏప్రిల్ 2 (బుధవారం) వరకు ఆరు రోజుల సుదీర్ఘ వారాంతపు సెలవు లభిస్తుంది.
మరోవైపు యూఏఈలోచంద్రుని దర్శనం మార్చి 29న జరుగుతుంది. ఇస్లామిక్ నెలలు 29 లేదా 30 రోజులు ఉంటాయి. పవిత్ర రమదాన్ మాసం ముగింపును సూచిస్తూ షావాల్ 1న ఈద్ జరుపుకుంటారు.
తాజా వార్తలు
- జూబ్లీహిల్స్ లో ఓట్ చోరీ జరిగిందంటూ KTR ఫిర్యాదు
- కేంద్రం సంచలన నిర్ణయం..
- ప్రధాని మోదీని కలవడం గర్వంగా ఉంది: సీఎం చంద్రబాబు
- సోషల్ మీడియా యూజర్స్ కి పోలీసులు హెచ్చరిక
- మహిళా ఫార్ములా 4 రేసర్
- మిసెస్ యూనివర్స్ 2025 గా భారత మహిళ
- జపాన్లో శాశ్వత నివాసానికి గోల్డెన్ ఛాన్స్!
- Gitex 2025: స్మార్ట్ కార్లు వీసా ఉల్లంఘనలు గుర్తింపు..!!
- వాడివేడిగా బహ్రెయిన్ పార్లమెంట్ సమావేశాలు..!!
- వెండింగ్ యంత్రాల ద్వారా మెడిసిన్ అమ్మకాలపై కీలక నిర్ణయం..!!