ఒమన్ లో పిల్లల రక్షణకు కట్టుదిట్టమైన చర్యలు..2500 కేసులు నమోదు..!!

- March 21, 2025 , by Maagulf
ఒమన్ లో పిల్లల రక్షణకు కట్టుదిట్టమైన చర్యలు..2500 కేసులు నమోదు..!!

మస్కట్: ఒమన్ సుల్తానేట్‌లోని సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ (MOSD) 2024కు సంబంధించి కీలక గణాంకాలను విడుదల చేసింది. సామాజిక సంక్షేమం, కుటుంబం, సమాజ అభివృద్ధి, పిల్లల రక్షణ, వైకల్య సేవలు, స్వచ్ఛంద పనిలో పురోగతిని హైలైట్ చేసింది.  పిల్లల రక్షణ,  వేధింపులకు గురైన పిల్లల 2,973 కేసులపై బాలల రక్షణ కమిటీలు పనిచేసినట్లు తెలిపింది.  563 కేసులను నమోదు చేయగా,  32 మంది బాలలను పునరావాసంలో.. తొమ్మిది మంది మార్గదర్శక కేంద్రాలలో చేర్పించారు. కుటుంబ రక్షణ సేవలు వేధింపులకు గురైన 72 మంది పిల్లలను చేర్చుకున్నాయి. చైల్డ్ ప్రొటెక్షన్ హెల్ప్‌లైన్‌కు 1,246 కాల్‌లు వచ్చాయి. మంత్రిత్వ శాఖ 27 మానవ అక్రమ రవాణా కేసులు, 17 మహిళల వివాహాన్ని నిరోధించిన కేసులు, తొమ్మిది మహిళల వేధింపుల కేసులను కూడా పరిష్కరించింది. సైకలాజికల్ కౌన్సెలింగ్, ఫ్యామిలీ గైడెన్స్ హెల్ప్‌లైన్ 2020 నుండి 2024 వరకు 1,390 కాల్‌లను నిర్వహించింది. 2024లో మాత్రమే 567 కాల్‌లు వచ్చాయి.  2024లో 2,786 మంది వ్యక్తులకు ప్రత్యక్ష కౌన్సెలింగ్ అందించాయి.

సామాజిక సహాయం, సాధికారతలో మంత్రిత్వ శాఖ 2024లో 102,167 కేసులకు OMR 11.986 మిలియన్ల సహాయాన్ని అందించింది. 2020 నుండి 2024 వరకు, 1,635 మంది వ్యక్తులు ఉపాధి-సంబంధిత శిక్షణ పొందారు. 2024లో 234 మంది శిక్షణ పొందారు. 2020 , 2025 మధ్య బలహీన వర్గాలకు 675 ఉపాధి అవకాశాలను మంత్రిత్వ శాఖ కల్పించింది. 2024 చివరి నాటికి 64,087 మంది వికలాంగులకు ఐడి కార్డులు అందించారు. పునరావాస కేంద్రాల సంఖ్య 119కి చేరుకున్నాయి. 2024లో 19 కొత్త కేంద్రాలు ప్రారంభించారు. దీని వలన 8,893 మందికి ప్రయోజనం చేకూరింది. 2020 నుండి 28,111 సహాయక పరికరాలు పంపిణీ చేయబడ్డాయి.

సామాజిక అభివృద్ధి కమిటీలు, స్వచ్ఛంద బృందాల నుండి సహాయం పొందిన లబ్ధిదారుల సంఖ్య 317,463 కు చేరుకుంది. 2024 లో OMR 25.506 మిలియన్లకు పైగా పంపిణీ చేయబడ్డాయి. "జూద్ ఛారిటీ" ప్లాట్‌ఫామ్ 168,747 మంది దాతల నుండి OMR 2.552 మిలియన్లు విరాళాలను సేకరించింది. సహాయ ప్రచారాల ద్వారా OMR 174,213 లను సేకరించింది. వైకల్య కార్యక్రమాలు, వృద్ధుల సంరక్షణ, విద్యార్థి కార్యక్రమాలు, మహిళా సంఘాలతో సహా దాని కార్యక్రమాల కోసం ప్రైవేట్, స్వచ్ఛంద సంస్థల నుండి మంత్రిత్వ శాఖకు OMR 802,440 మద్దతు లభించిందన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com