అబుదాబిలో కఠిన నియమాలు..మార్పులు చేస్తే Dh4,000 జరిమానా..!!

- March 23, 2025 , by Maagulf
అబుదాబిలో కఠిన నియమాలు..మార్పులు చేస్తే Dh4,000 జరిమానా..!!

యూఏఈ:  అబుదాబి నగర సుందరీకరణకు ప్రాధాన్యం ఇస్తుంది. ఇందులో భాగంగా కఠిన నిర్ణయాలను అమలు చేస్తుంది. పట్టణ పర్యావరణం విభాగం నగర సుందరీకరణ సమగ్రతను కాపాడటానికి నిరంతర ప్రయత్నంలో భాంగా మునిసిపాలిటీలు అండ్ రవాణా శాఖ (DMT) నగరం ఆకర్షణను కాపాడటానికి కఠినమైన నిబంధనలను ప్రవేశపెట్టింది.
ఈ కొత్త నియమాలు.. తగిన లైసెన్స్ లేకుండా భవనాలు, సౌకర్యాలు, వాణిజ్య సంస్థల ముందు భాగాలను, ఉపకరణాలు, పరికరాలు లేదా ఏవైనా మార్పులను చేయడాన్ని నిషేధించాయి. ఉల్లంఘించినవారికి మొదటి నేరానికి Dh1,000, రెండవ ఉల్లంఘనకు Dh2,000, మూడవ లేదా పునరావృత నేరాలకు Dh4,000 జరిమానా విధించబడుతుందని హెచ్చరించారు. ప్రాపర్టీ యజమానులు ఇప్పుడు అటువంటి మార్పులు చేసే ముందు సరైన అనుమతులను పొందవలసి ఉంటుందని తెలిపారు.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com