నేపాల్‌లో వివాహ వయసు 18కి తగ్గింపు !
- March 25, 2025
నేపాల్: నేపాల్ ప్రభుత్వం వివాహానికి కనీస అర్హత వయసును 20 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు తగ్గించేందుకు కసరత్తు చేస్తోంది. బాల్య వివాహాలకు విధించే జరిమానానూ తగ్గించాలని భావిస్తోంది. వివాహ వయసు 20 ఏళ్లు ఉండటంవల్ల ఎటువంటి ఉపయోగం లేదని, అత్యాచారాలు పెరగడానికే కారణమవుతోందని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. ఈ కారణంగానే వివాహ వయసును తగ్గించేలా బాలల చట్టం, క్రిమినల్ కోడ్‌లను సవరించాలని నిర్ణయించామని న్యాయశాఖ మంత్రి అజయ్ చౌరాసియా సోమవారం తెలిపారు. ఈ చట్ట సవరణ బిల్లుపై చర్చలు చివరి దశలో ఉన్నాయని, వైద్య, మానసిక నిపుణులను సంప్రదిస్తున్నామని వివరించారు.
ప్రస్తుత వివాహ వయసు ఫలితాలివ్వడం లేదు
చట్ట సవరణకు ప్రభుత్వం తుది రూపునిస్తోందని హోంశాఖ మంత్రి రమేశ్ లేఖక్ తెలిపారు. ప్రస్తుత వివాహ వయసు ఫలితాలివ్వడం లేదు. ప్రభుత్వం రెండు మోడళ్లపై కసరత్తు చేస్తోంది. అందులో మొదటిది వివాహ వయసును తగ్గించడం. రెండోది రోమియో జూలియట్ చట్టం. అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో అమల్లో ఉన్న రోమియో జూలియట్ చట్టం ప్రకారం.. వివాహం కాకున్నా.. నిర్దేశిత వయసు కన్నా ముందుగా ఇద్దరు యువతీ యువకులు శృంగారంలో పాల్గొన్నా దానిని రేప్‌గా పరిగణించరు. వారిద్దరి మధ్య రెండు మూడేళ్ల గ్యాప్ మాత్రమే ఉండాలి.
18 ఏళ్లలోపు అమ్మాయిలను ప్రేమ వివాహాలు
నేపాల్‌లోని క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 2017 ప్రకారం.. 18 ఏళ్లలోపు యువతితో లైంగిక సంబంధం నెరిపితే రేప్‌గా పరిగణిస్తారు. ఆ యువతికి అంగీకారమున్నా చట్టం ఒప్పుకోదు. దీంతో వేల మంది యువకులు 18 ఏళ్లలోపు అమ్మాయిలను ప్రేమ వివాహాలు చేసుకున్నా, వారి అంగీకారంతో పెళ్లాడినా బాల్య వివాహ నేరంతోపాటు రేప్ కేసుల్లో ఇరుక్కుంటున్నారు. ఈ విధానాన్ని మార్చాలని నేపాల్ ప్రభుత్వం భావిస్తోంది.
తాజా వార్తలు
- అస్థిర వాతావరణం..రియాద్ లో స్కూల్స్ బంద్..!!
- కువైట్ నేవీ పెట్రోల్ బోట్ గరో, ఇండియన్ షిప్ కండక్ట్ జాయింట్ డ్రిల్..!!
- దర్బ్ అల్ సాయ్ ని సందర్శించిన పీఎం..!!
- సనద్ సేవా కేంద్రాల ల్యాబ్ కార్యకలాపాలు ప్రారంభం..!!
- బహ్రెయిన్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ రూట్ మ్యాప్..!!
- ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు
- మోదీ ప్రభుత్వాన్ని దేశం నుంచి తొలగిస్తాం: రాహుల్ గాంధీ
- ప్రపంచ అక్షరాస్యత ర్యాంకింగ్లో ఖతార్ స్ట్రాంగ్..!!
- వ్యవసాయ కార్మికులకు 30 రోజుల వార్షిక సెలవులు..!!







