తెలుగు సిరీస్ డైరెక్టర్ కి ఉత్తమ దర్శకుడు అవార్డు..
- March 25, 2025
ముంబై: ఇటీవల ముంబైలో హిందూస్తాన్ టైమ్స్ ఓటిటిప్లే అవార్డ్స్ 2025 జరిగాయి. ‘వన్ నేషన్, వన్ అవార్డు’ అనే థీమ్ తో దేశవ్యాప్తంగా ఓటిటిలో ఉన్న బెస్ట్ కంటెంట్ కు ఈ అవార్డులు ఇస్తున్నారు. ఈసారి ‘డిస్పాచ్’ కి ఉత్తమ నటుడుగా మనోజ్ బాజ్‌పాయ్, ‘భామ కలాపం 2’ కి ఉత్తమ నటిగా ప్రియమణికి ‘ది రానా దగ్గుబాటి షో’కి ఉత్తమ టాక్ షో హోస్ట్‌గా రానా దగ్గుబాటికి అవార్డులు వచ్చాయి.
ఈ క్రమంలో ఉత్తమ దర్శకుడిగా వికటకవి సిరీస్ కి గాను డైరెక్టర్ ప్రదీప్ మద్దాలికి హిందూస్తాన్ టైమ్స్ ఓటిటిప్లే 2025 అవార్డు వరించింది. జీ5 లో స్ట్రీమ్ అవుతున్న సూపర్ హిట్ సిరీస్ వికటకవికి గాను ప్రదీప్ ఈ అవార్డు అందుకున్నారు. నిఖిల్ అద్వానీ (ఫ్రీడమ్ అట్ నైట్) తో కలిసి ప్రదీప్ మద్దాలి ఈ అవార్డుని పంచుకున్నారు.
నరేష్ అగస్త్య, మేఘా ఆకాష్ ముఖ్య పాత్రల్లో SRT ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామ్ తాళ్లూరి నిర్మాణంలో ప్రదీప్ మద్దాలి దర్శకత్వంలో వికటకవి సిరీస్ తెరకెక్కింది. 1970ల నాటి గ్రామీణ కథతో సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన వికటకవి సిరీస్ జీ5 ఓటీటీలో గత నవంబర్ నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సిరీస్ జీ5 ఓటీటీలో పెద్ద హిట్ అయింది. ఇప్పుడు ఈ సిరీస్ కి గాను ఉత్తమ దర్శకుడు అవార్డు రావడం గమనార్హం.
దర్శకుడు ప్రదీప్ మద్దాలి ఇంజనీరింగ్, ఐటీ బ్యాక్ గ్రౌండ్ నుండి వచ్చి సినీ పరిశ్రమలో కెరీర్ ప్రారంభించారు. ’47 డేస్’, ఆధ్యాత్మిక సిరీస్ ‘సర్వం శక్తి మయం’తో పాటు ఇప్పుడు ‘వికటకవి’ సిరీస్ తో దర్శకుడిగా దూసుకెళ్తున్నారు ప్రదీప్ మద్దాలి. ఇటీవల గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI)లో ప్రదర్శించబడిన మొదటి తెలుగు వెబ్ సిరీస్ గా వికటకవి నిలిచింది. అవార్డు అందుకున్న సందర్భంగా ప్రదీప్ మద్దాలి ఓటిటిప్లే అవార్డ్స్ కు, అతని తల్లిదండ్రులు, మూవీ టీమ్ కు కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్‌లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్‌కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!
- భారత్‌కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!