టూరిజం హబ్ గా దమానియాత్ దీవులు.. 96వేలమంది సందర్శన..!!

- March 25, 2025 , by Maagulf
టూరిజం హబ్ గా దమానియాత్ దీవులు.. 96వేలమంది సందర్శన..!!

బర్కా: దమానియాత్ దీవుల నేచర్ రిజర్వ్‌ను సందర్శించే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 2023లో 71, 263 మంది సందర్శకులు, 2024లో 96,625 మంది సందర్శకులు సందర్శించారు. దమానియాత్ దీవుల నేచర్ రిజర్వ్ మొత్తం వైశాల్యం సముద్ర పరిసర ప్రాంతంతో సహా 203 చదరపు కిలోమీటర్లు అని సౌత్ అల్ బటినా గవర్నరేట్‌లోని పర్యావరణ శాఖ డైరెక్టర్ సలీం సయీద్ అల్ మస్కారి తెలిపారు.

నవంబర్ ప్రారంభం నుండి ఏప్రిల్ చివరి వరకు నైట్ స్టే తోపాటు క్యాంపింగ్ కోసం ఎన్విరాన్‌మెంట్ అథారిటీ అల్ జబల్ అల్ కబీర్ ద్వీపం, లాజౌన్ ద్వీపాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. వివిధ రంగాలలోని పరిశోధకులకు రిజర్వ్‌ను ఆకర్షణీయంగా మార్చడానికి ఇంటరాక్టివ్ స్క్రీన్‌లను అమర్చడం ద్వారా రిజర్వ్  కు వచ్చే సందర్శకుల సంఖ్య విపరీతంగా పెరిగిందన్నారు.

దమానియాత్ దీవులలో 2024లో ప్రారంభించిన అండర్-వాటర్ మిలిటరీ మ్యూజియం ప్రత్యేక ఆకర్షణ అని తెలిపారు. ఎన్విరాన్‌మెంట్ అథారిటీ ఎన్విరాన్‌మెంట్ అథారిటీ పోర్టల్ ద్వారా దమానియాత్ దీవుల నేచర్ రిజర్వ్‌ను సందర్శించడానికి బుకింగ్ చేసుకోవచ్చని సూచించారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com