ఖతార్‌లో పోస్టల్ వినియోగదారుల రక్షణకు కొత్త పాలసీ..!!

- March 25, 2025 , by Maagulf
ఖతార్‌లో పోస్టల్ వినియోగదారుల రక్షణకు కొత్త పాలసీ..!!

దోహా: ఖతార్ లో పోస్టల్ రంగానికి వినియోగదారుల రక్షణ విధానాన్ని కమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీ (CRA) అమలు చేస్తుంది. ఈ మేరకు పోస్టల్ వినియోగదారుల రక్షణ కోసం నియంత్రణలను జారీ చేసింది. పోస్టల్ వినియోగదారుల హక్కులను కాపాడటంతోపాటు వారికి న్యాయమైన, పారదర్శకమైన, జవాబుదారీగా ఉండేందుకు కొత్త పాలసీ దోహదం చేస్తుందని వెల్లడించారు.

కొత్త పాలసీ అమలు ద్వారా వినియోగదారులు తమకు అందించే సేవల గురించి స్పష్టమైన, ఖచ్చితమైన, అందుబాటులో ఉండే సమాచారాన్ని పొందవచ్చు.  ఇది వినియోగదారుల హక్కులకు బలమైన పునాదిని ఏర్పరుస్తుంది.  దీంతోపాటు సేవలపై ఫిర్యాదులను పరిష్కరించడానికి వినియోగదారులకు మరిన్ని మార్గాలను పొందేందుకు ఇది హామీ ఇస్తుందని CRAలోని వినియోగదారుల వ్యవహారాల విభాగం డైరెక్టర్ అమెల్ సలేం అల్ హనావి అన్నారు. ఈ ప్రయత్నాలు ఖతార్ పోస్టల్ సేవలపై నమ్మకాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. CRA అత్యున్నత ప్రమాణాలకు అనుగుణంగా పోటీతత్వ, సమర్థవంతమైన, అధునాతన పోస్టల్ పర్యావరణ వ్యవస్థను నిర్మించడానికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com