యెమెన్ విమానాశ్రయం సమీపంలో జంట పేలుళ్లు, 6 మృతి
- July 06, 2016
మరోసారి విమానాశ్రయమే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులకు తెగబడ్డారు. ఈసారి యెమెన్‌లోని అడెన్ విమానాశ్రయానికి సమీపంలో రెండు కారుబాంబు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో తీవ్ర గాయాలపాలయ్యారు.
ఈ ఘటనలో ఒక కారు మిలటరీ క్యాంపు బేస్ వద్ద పేల్చగా.. మరో కారును క్యాంపు లోపలికి తీసుకెళ్లాక పేల్చారు. అయితే, అక్కడే ఉన్న మిలటరీ స్థావరం, ఎయిర్ పోర్ట్ లక్ష్యంగా ఉగ్రవాదులు ఈ దాడి చేసినట్లు తెలుస్తోంది.
చనిపోయిన వాళ్లంతా మిలటరీ చెందిన వారే. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఏ ఉగ్రవాద సంస్థ ఈ దాడులకు పాల్పడిందనే విషయం ఇంకా తెలియరాలేదు.
గత కొంతకాలంగా ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) ఉగ్రవాద ఇలాంటి దాడులు చేస్తున్న నేపథ్యంలో తాజాగా యెమెన్ దాడి కూడా వారి పనే అని అధికారులు అనుమానిస్తున్నారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







