అభినేత్రి త్వరలో రిలీజ్ కు రెడీ
- July 05, 2016
ఇన్నాళ్లు గ్లామర్ పాత్రల్లో అలరించిన తమన్నా, తొలిసారిగా నటిస్తున్న లేడీ ఓరియంటెడ్ సినిమా అభినేత్రి. నటుడిగా, కొరియోగ్రాఫర్ గా, దర్శకుడిగా మంచి విజయాలు సాధించిన ప్రభుదేవా.. ఈ సినిమాతో నిర్మాతగా మారుతున్నాడు. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో కూడా ఒకేసారి తెరకెక్కుతున్న ఈ సినిమాను 70 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
తెలుగు వర్షన్ కు కోన వెంకట్, ఎంవివి సత్యనారాయణ, బ్లూ సర్కిల్ కార్పొరేషన్ లు సహనిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న అభినేత్రి, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. త్వరలో రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ సినిమా ఆడియో వేడుకను భారీగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్.
ఆగస్టు 15న విజయవాడ వేదికగా ఈ కార్యక్రమాన్ని ప్లాన్ చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అతిలోక సుందరి శ్రీదేవి హాజరవుతారన్న టాక్ వినిపిస్తోంది. విజయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో తమన్నా, ప్రభుదేవా, సోనూసూద్, మురళీ శర్మలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







