టీమిండియా వెస్టిండీస్ బయలుదేరింది
- July 06, 2016
నాలుగు టెస్ట్‌ల సిరీస్ కోసం కోహ్లి కెప్టెన్సీలోని టీమిండియా వెస్టిండీస్ బయలుదేరింది. బుధవారం ఉదయం ముంబై ఎయిర్పోర్ట్ నుంచి టీమ్ విండీస్ ఫ్లైట్ ఎక్కింది. కొత్త కోచ్ కుంబ్లే సహా 16 మంది టీమ్ సభ్యులు, సపోర్టింగ్ స్టాఫ్ విండీస్ వెళ్లారు. ఈ నెల 9, 10 తేదీల్లో విండీస్ క్రికెట్ బోర్డు ప్రెసిడెంట్ ఎలెవన్‌తో సెయింట్ కీట్స్‌లో జరిగే రెండు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌తో విండీస్ టూర్ మొదలవుతుంది. ఆ తర్వాత ఇదే వేదికలో జులై 14 నుంచి 16 వరకు మూడు రోజుల వామప్ మ్యాచ్ ఆడుతుంది టీమిండియా. తొలి టెస్ట్ ఈ నెల 21 నుంచి ఆంటిగ్వాలోని వివియన్ రిచర్డ్స్ క్రికెట్ గ్రౌండ్లో మొదలవుతుంది. రెండో టెస్ట్ జులై 30 నుంచి ఆగస్ట్ 3 వరకు కింగ్స్టన్లోని సబీనా పార్క్‌లో, మూడో టెస్ట్ సెయింట్ లూసియాలోని సామి నేషనల్ క్రికెట్ స్టేడియంలో, నాలుగోటెస్ట్ పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లోని క్వీన్స్ పార్క్ ఓవల్‌లో జరుగుతాయి. చివరిసారి 2011లో విండీస్ టూర్‌కెళ్లిన టీమిండియా.. మూడుటెస్ట్‌ల సిరీస్‌ను 1-0తో గెలుచుకుంది. ఆ సిరీస్‌తోనే టెస్ట్ అరంగేట్రం చేసిన కోహ్లి.. ఇప్పుడు కెప్టెన్‌గా, టీమ్‌లో ప్రధాన బ్యాట్స్‌మన్‌గా మరోసారి విండీస్‌కు వెళ్లడం విశేషం. విండీస్‌కు వెళ్లిన టీమ్: విరాట్ కోహ్లి (కెప్టెన్), రహానే (వైస్ కెప్టెన్), విజయ్, ధావన్, రాహుల్, పుజారా, రోహిత్‌శర్మ, సాహా, అశ్విన్, అమిత్ మిశ్రా, రవీంద్ర జడేజా, ఇషాంత్‌శర్మ, షమి, భువనేశ్వర్, షార్దూల్ ఠాకూర్, స్టువర్ట బిన్నీ.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







