యెమెన్ విమానాశ్రయం సమీపంలో జంట పేలుళ్లు, 6 మృతి

- July 06, 2016 , by Maagulf
యెమెన్ విమానాశ్రయం సమీపంలో జంట పేలుళ్లు, 6 మృతి

మరోసారి విమానాశ్రయమే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులకు తెగబడ్డారు. ఈసారి యెమెన్‌లోని అడెన్ విమానాశ్రయానికి సమీపంలో రెండు కారుబాంబు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో తీవ్ర గాయాలపాలయ్యారు.
ఈ ఘటనలో ఒక కారు మిలటరీ క్యాంపు బేస్ వద్ద పేల్చగా.. మరో కారును క్యాంపు లోపలికి తీసుకెళ్లాక పేల్చారు. అయితే, అక్కడే ఉన్న మిలటరీ స్థావరం, ఎయిర్ పోర్ట్‌ లక్ష్యంగా ఉగ్రవాదులు ఈ దాడి చేసినట్లు తెలుస్తోంది.
చనిపోయిన వాళ్లంతా మిలటరీ చెందిన వారే. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఏ ఉగ్రవాద సంస్థ ఈ దాడులకు పాల్పడిందనే విషయం ఇంకా తెలియరాలేదు.
గత కొంతకాలంగా ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) ఉగ్రవాద ఇలాంటి దాడులు చేస్తున్న నేపథ్యంలో తాజాగా యెమెన్ దాడి కూడా వారి పనే అని అధికారులు అనుమానిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com