బెట్టింగ్ ల నియంత్రణకు ప్రత్యేక చట్టం: సీఎం చంద్రబాబు
- March 26, 2025
అమరావతి: బెట్టింగ్ లను నియంత్రించేందుకు ప్రత్యేక చట్టాన్ని తీసుకొద్దామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. బెట్టింగ్ యాప్ లు ఎంతో మంది జీవితాలను సర్వనాశనం చేస్తున్నాయి. వీటి బారిన పడిన ఎందరో ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ యాప్ లను సినీ నటులు, యూట్యూబర్లు, క్రీడాకారులు ప్రమోట్ చేస్తుండటంతో… ఎంతోమంది వీటికి ఆకర్షితులవుతున్నారు. ఒక్కసారి బెట్టింగ్ వలలో పడ్డారంటే… ఇక బయట పడటం దాదాపు అసాధ్యమనే చెప్పొచ్చు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ భూతం కలకలం రేపుతోంది. ఈ యాప్ లను ప్రమోట్ చేసిన పలువురు సెలబ్రిటీలు కేసులు ఎదుర్కొంటున్నారు.
తాజా పరిణామాల నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆన్ లైన్ బెట్టింగ్ పై ఉక్కుపాదం మోపుదామన్నారు. మనం తీసుకునే నిర్ణయాలు ఆన్ లైన్ గ్యాంబ్లింగ్ ను పూర్తిగా అరికట్టేలా ఉండాలని చెప్పారు. రాష్ట్రంలో నేరాలు తగ్గినప్పటికీ… ఆర్థిక నేరాలు పెరిగాయని చంద్రబాబు చెప్పారు.
గంజాయి సాగు కూడా తగ్గిందని తెలిపారు. నేరస్తులు చాలా తెలివిగా ఉంటారని… సాక్ష్యాలు దొరకకుండా మాయం చేస్తారని చెప్పారు. నేరస్తుల్లో కొందరు పారిపోతారని…. మరికొందరు నేరాన్ని పక్క వ్యక్తులపై తోసేస్తారని… వైఎస్ వివేకా హత్య కేసు దీనికి ఉదాహరణ అని అన్నారు. నేరాలను తగ్గించేందుకు పోలీసులు టెక్నాలజీని వాడుకోవాలని సూచించారు. నేరాలకు సంబంధించి ఫోరెన్సిక్ ఎవిడెన్స్ సేకరణలో జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. మావోయిస్టుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. నేరాల నియంత్రణకు ప్రజల సహకారం కూడా తీసుకోవాలని చెప్పారు.
తాజా వార్తలు
- మంత్రులు, కార్యదర్శుల మీటింగ్లో సీఎం చంద్రబాబు సీరియస్..
- PSLV-C62 సిగ్నల్ కట్.. సగం దూరం వెళ్లాక..
- ఇజ్రాయెల్ పై దాడి చేస్తాం అంటూ ట్రంప్ కు వార్ణింగ్ ఇచ్చిన ఖమేనీ
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం







