ఫుజైరా పెట్రోలియం కేంద్రం పై డ్రోన్ దాడి: అదుపులో మంటలు..
- March 16, 2026
ఫుజైరా: ఫుజైరా ఎమిరేట్‌లోని ఒక పెట్రోలియం పరిశ్రమల కేంద్రంపై డ్రోన్ దాడి జరగడం వల్ల అక్కడ అగ్నిప్రమాదం సంభవించినట్లు ఫుజైరా ప్రభుత్వ మీడియా ఆఫీస్ అధికారికంగా ప్రకటించింది. అయితే, ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని మరియు పరిస్థితిని త్వరితగతిన అదుపులోకి తెచ్చామని అధికారులు వెల్లడించారు.
సంఘటన జరిగిన వెంటనే అత్యవసర మరియు ప్రత్యేక సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. సివిల్ డిఫెన్స్ విభాగాలు మంటలు వ్యాపించకుండా సకాలంలో స్పందించి, మంటలను ఒక పరిమిత ప్రాంతానికే అరికట్టగలిగారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితిని పూర్తిగా నియంత్రణలోకి తెచ్చేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ప్రస్తుత పరిస్థితుల్లో సోషల్ మీడియాలో వచ్చే ధృవీకరించని వార్తలు లేదా వదంతులను (Rumours) నమ్మవద్దని మరియు వాటిని ఇతరులకు షేర్ చేయవద్దని అధికారులు ప్రజలను కోరారు. ఇటువంటి సున్నితమైన విషయాల్లో కేవలం ప్రభుత్వ అధికారిక వనరుల నుండి వచ్చే సమాచారాన్ని మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలని సూచించారు.
— Fujairah Media Office (@FjMediaoffice) March 16, 2026
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







