ఆన్ లైన్ బెట్టింగ్ నిరోధానికి సిట్ ఏర్పాటు: సీఎం రేవంత్
- March 26, 2025
హైదరాబాద్: ఆన్ లైన్ బెట్టింగ్ అనేది అంతర్జాతీయ నేరంగా మారిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ ఆన్ లైన్ బెట్టింగ్, రమ్మీ పట్ల కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.శాంతి భద్రతల అంశంపై శాసనసభలో ఆయన మాట్లాడుతూ…ఆన్ లైన్ బెట్టింగ్ నిరోధానికి, నిషేధించేందుకు సిట్ వేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఇలాంటి కేసుల్లో పడే శిక్షలను సైతం సవరించుకోవాల్సిన అవసరం ఉందని సీఎం అన్నారు.
రాష్ట్రంలోకి పెటుబడులు రాకుండా బీఆర్ఎస్ అసత్య ప్రచారాలు చేస్తున్నదని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవంటూ విషప్రచారం చేస్తుందంటూ విమర్శించారు.. గత కేసీఆర్ పాలనలో దిశ ఘటన జరిగిందని, వామనరావు దంపతులను నడిరోడ్డుపై నరికి హత్య చేశారని గుర్తు చేశారు. ఈ కేసుల విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. ఎంఎంటీఎస్ లో ఘటన జరిగిన వెంటనే తాము స్పందించామన్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నామన్నారు. భాదితురాలికి ప్రభుత్వం అండగా నిలబడిందన్నారు. మెరుగైన వైద్య సాయం అందిస్తున్నామన్నారు. తమ పాలనలోనే శాంతి భద్రతలు పటిష్టంగా ఉన్నాయన్నారు.
తాజా వార్తలు
- క్రైస్తవ సమస్యలు పరిష్కరిస్తా: మంత్రి అజారుద్దీన్
- తెలంగాణ రాష్ట్రంలో కొద్దిగా తగ్గిన చలితీవ్రత
- దుర్గమ్మ నినాదాలతో మార్మోగుతున్న బెజవాడ
- ఇక అన్ని ఆలయాల్లో యుపిఐ చెల్లింపులు
- ఇన్స్టాగ్రామ్ లో కొత్త ఫీచర్
- NATS సాయంతో ప్రభుత్వ పాఠశాలల్లో విప్లవాత్మక మార్పులు
- బహ్రెయిన్ గోల్డెన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఇండియన్ స్కూల్..!!
- కింగ్ అబ్దులాజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయం కొత్త రికార్డు..!!
- 30వేలకు పైగా ట్రాఫిక్ లేన్ చట్ట ఉల్లంఘనలు నమోదు..!!
- మెడికల్ సిటీ ఆధ్వర్యంలో దివ్యాంగుల దినోత్సవం..!!







