త్వరలో వాట్సాప్ ద్వారా రిటైలర్ల పై ఫిర్యాదులు..!!
- March 26, 2025
యూఏఈ: దుబాయ్‌లోని వినియోగదారులు త్వరలో వాట్సాప్ ద్వారా నేరుగా రిటైలర్లపై ఫిర్యాదులను దాఖలు చేయవచ్చు. దుబాయ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకానమీ అండ్ టూరిజం (DET)లో భాగమైన దుబాయ్ కార్పొరేషన్ ఫర్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అండ్ ఫెయిర్ ట్రేడ్ (DCCPFT) ఈ చొరవను వచ్చే నెలలో అమలులోకి తీసుకురానుంది.
DCCPFTలోని వినియోగదారుల రక్షణ విభాగం డైరెక్టర్ అహ్మద్ అలీ మూసా మాట్లాడుతూ.. ఫిర్యాదు ప్రక్రియను సులభతరం చేయడానికి ప్లాట్‌ఫామ్ కృత్రిమ మేధస్సును ఉపయోగిస్తుందని వివరించారు. వినియోగదారులు సంబంధిత పత్రాలను అప్లోడ్ చేయాలని, వారి కొనుగోళ్లు లేదా వివాదాల గురించి కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ప్రక్రియ చెల్లుబాటు కావాలంటే, వినియోగదారులు తమ వాదనలకు మద్దతుగా ఇన్వాయిస్లతో సహా అవసరమైన పత్రాలను అందించాలన్నారు.
ప్రస్తుతం వెబ్సైట్, కాల్ సెంటర్ నంబర్ 600545555 ద్వారా వినియోగదారుల రక్షణ విభాగానికి ఫిర్యాదులను సమర్పించే అవకాశం ఉంది. మరింత సమాచారం కోసం DET అధికారిక వెబ్సైట్, consumerrights.ae ని సందర్శించాలని ఆయన సూచించారు.
తాజా వార్తలు
- క్రైస్తవ సమస్యలు పరిష్కరిస్తా: మంత్రి అజారుద్దీన్
- తెలంగాణ రాష్ట్రంలో కొద్దిగా తగ్గిన చలితీవ్రత
- దుర్గమ్మ నినాదాలతో మార్మోగుతున్న బెజవాడ
- ఇక అన్ని ఆలయాల్లో యుపిఐ చెల్లింపులు
- ఇన్స్టాగ్రామ్ లో కొత్త ఫీచర్
- NATS సాయంతో ప్రభుత్వ పాఠశాలల్లో విప్లవాత్మక మార్పులు
- బహ్రెయిన్ గోల్డెన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఇండియన్ స్కూల్..!!
- కింగ్ అబ్దులాజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయం కొత్త రికార్డు..!!
- 30వేలకు పైగా ట్రాఫిక్ లేన్ చట్ట ఉల్లంఘనలు నమోదు..!!
- మెడికల్ సిటీ ఆధ్వర్యంలో దివ్యాంగుల దినోత్సవం..!!







