మయన్మార్, బ్యాంకాక్ లో భారీ భూకంపం..
- March 28, 2025
మయన్మార్ లో భారీ భూకంపం సంభవించింది.రికర్ట్ స్కేల్ పై దీని తీవ్రత 7.7గా నమోదైంది. సెంట్రల్ మయన్మార్ లోని మోనివా నగరానికి తూర్పున 50 కిలో మీటర్ల దూరంలో 10కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రం ఉన్నట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే గుర్తించింది.
మయన్మార్ లో భారీ భూకంపం కారణంగా పొరుగున ఉన్న థాయ్ లాండ్ రాజధాని బ్యాంకాక్ లో తీవ్ర భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. పలు దఫాలుగా ప్రకంపనలు చోటు చేసుకోవటంతో ప్రజలు ఇళ్ల నుంచి భయంతో బయటకు పరుగులు తీశారు. అయితే, బ్యాంకాక్ లో ప్రకంపనల తీవ్రత 7.3గా నమోదైంది. భూకంపం కారణంగా పలు భవనాలు ధ్వంసమయ్యాయి. ఇక థాయి లాండ్ లో ఎమర్జెన్సీ విధించారు. భూకంపం తీవ్రత అధికంగా ఉండడంతో ప్రధాని షినవ్రత.
బ్యాంకాక్ లో భారీ భూకంపం కారణంగా భవనాలు కూలిపోతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓ భారీ భవంతి పైఅంతస్తులో ఉన్న స్విమ్మింగ్ పూల్ లోని నీరు కిందకు పడిపోయిన దృశ్యాలకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. మరోవైపు మయన్మార్ లోనూ అనేక భవనాలు ధ్వంసమైనట్లు తెలిసింది. మయన్మార్ లోని మండలేలో ఉన్న ఐకానిక్ అవా వంతెన ఇరావడీ నదిలో కూలిపోయింది.
తాజా వార్తలు
- క్రైస్తవ సమస్యలు పరిష్కరిస్తా: మంత్రి అజారుద్దీన్
- తెలంగాణ రాష్ట్రంలో కొద్దిగా తగ్గిన చలితీవ్రత
- దుర్గమ్మ నినాదాలతో మార్మోగుతున్న బెజవాడ
- ఇక అన్ని ఆలయాల్లో యుపిఐ చెల్లింపులు
- ఇన్స్టాగ్రామ్ లో కొత్త ఫీచర్
- NATS సాయంతో ప్రభుత్వ పాఠశాలల్లో విప్లవాత్మక మార్పులు
- బహ్రెయిన్ గోల్డెన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఇండియన్ స్కూల్..!!
- కింగ్ అబ్దులాజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయం కొత్త రికార్డు..!!
- 30వేలకు పైగా ట్రాఫిక్ లేన్ చట్ట ఉల్లంఘనలు నమోదు..!!
- మెడికల్ సిటీ ఆధ్వర్యంలో దివ్యాంగుల దినోత్సవం..!!







